ఘోర రోడ్డుప్రమాదం..ఆరుగురు మెడికోలు దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ వ్యాన్‌ను కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన...
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మినీ వ్యాన్‌ను కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం తిరువూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఓ కారు.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన విద్యార్థులంతా మెడికోలుగా గుర్తించారు. వీరి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.