తిరుపతి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
చిత్తూరు జిల్లా తిరుపతి అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (డిఎఫ్‌ఒ) వెంకటా చలపతి నాయుడు నివాసంలో ఉదయం నుంచి ఏసీబి...
చిత్తూరు జిల్లా తిరుపతి అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (డిఎఫ్‌ఒ) వెంకటా చలపతి నాయుడు నివాసంలో ఉదయం నుంచి ఏసీబి దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అన్నారావు కూడలి సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్ వెనుకవైపు ఉన్న ఎం 2 గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్థులో ఉన్న చలపతి నాయుడు నివాసంలో ఎసిబి తనిఖీలు కొనసాగుతున్నాయి. తిరుపతితోపాటు కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పలు దస్త్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.