జూబ్లీహిల్స్‌లో ఎస్సై ఆత్మహత్య కలకలం
హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ భవానీ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు
హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ భవానీ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర పోలీసు వర్గల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన నివాసం ఉంటున్న గదిలోనే గురువారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. శంకర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.