చేవెళ్ల మహిళ మర్డర్ కేసులో పురోగతి.. ఆ మహిళ ఎవరంటే..

దిశ ఘటనలా సంచలనం రేపిన చేవెళ్ల తంగేడుపల్లి మహిళ మర్డర్ కేసులో పురోగతి సాధించారు. మర్డర్‌కు గురైనా.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ నివేదికతో..

చేవెళ్ల మహిళ మర్డర్ కేసులో పురోగతి.. ఆ మహిళ ఎవరంటే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 10:05 PM

దిశ ఘటనలా సంచలనం రేపిన చేవెళ్ల తంగేడుపల్లి మహిళ మర్డర్ కేసులో పురోగతి సాధించారు. మర్డర్‌కు గురైనా.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ నివేదికతో.. ముందుగా మహిళ మెడకు తాడుతో ఉరేసి అనంతరం తలపై బలంగా మోది హత్య చేసినట్లు వైద్యులు గుర్తించారు. చనిపోయిన మహిళకు స్మోకింగ్ చేసే అలవాటు ఉందని, తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

మృతురాలు వివాహిత అని, మహిళ ఎడమ కన్ను మొహంపై బలంగా గుద్దిన కమిలిపోయిన గాయాలు, చేతులతో గొంతు నులుమినట్లు ఆనవాలు, మహిళ మెడతో పాటు రెండు చేతులు కట్టేసినట్లు ఆనవాలను గుర్తించారు. మహిళకు సంబంధించిన రక్త నమూనాలు, విశ్రా శాంపుల్స్‌ని ఉస్మానియా ఫోరెన్సిక్‌కి పంపించారు పోలీసులు. కేసు చిక్కుముడి వీదెంటవరకు మహిళ మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలోనే భద్రపరచనున్నారని పోలీసులు తెలిపారు.

హత్యకు గురైన బాధితురాలికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ జరిగిందని, వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఈ హత్య ఉదంతంలో ముగ్గురి హస్తం ఉండి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధం కారణంగానే మర్డర్ జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే.. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు.

Read More this also: 

ఫ్లాష్‌న్యూస్: రాజమౌళికి షాక్.. RRR నుంచి తప్పుకోనున్న అలియా భట్!

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి