Yogi “Fake” Audio Clip: ఒక్క ట్వీట్‌కు రూ.2.. మరో వివాదంలో యూపీ సీఎం యోగి.. “నకిలీ” ఆడియో క్లిప్ కేసులో బీజేపీ నేత భర్త అరెస్టు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం యోగికి అనుకూలంగా చేసిన ఒక్కో ట్వీట్‌కు రూ.2 అందుతాయంటూ తప్పుడు ఆడియో క్లిప్ తయారు చేసిన ఇద్దరి అరెస్ట్.

Yogi Fake Audio Clip: ఒక్క ట్వీట్‌కు రూ.2.. మరో వివాదంలో యూపీ సీఎం యోగి.. నకిలీ ఆడియో క్లిప్ కేసులో బీజేపీ నేత భర్త అరెస్టు
Rs.2 A Tweet To Support Yogi Adityanath
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 08, 2021 | 8:18 AM

Rs.2 A Tweet To Support Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే పరిపాలనపై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న బీజేపీ.. యూపీ స్థానిక ఎన్నికల్లో 35 శాతం ఫలితాలను సాధించింది. తాజాగా సీఎం యోగికి అనుకూలంగా చేసిన ఒక్కో ట్వీట్‌కు రెండు రూపాయలు అందుతాయంటూ తప్పుడు ఆడియో క్లిప్ తయారు చేసిన ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఇద్దరిలో ఒక వ్యక్తికి భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య డాక్టర్ ప్రీతి రాష్ట్ర బీజేపీ కోఆర్డినేటర్‌గా ఉత్తర ప్రదేశ్ బాలల హక్కుల సంఘం సభ్యులుగా కూడా ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోషల్ మీడియా విభాగంలో గతంలో పని చేశారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, వీరి అరెస్టులపై యూపీ ప్రభుత్వం లేదా సీఎంఓ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఆశీష్ పాండే, హిమన్షు సైనీ అనే ఇద్దరు వ్యక్తుల్ని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోర్జరీ, మోసం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీళ్లు తయారు చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి, మరో వ్యక్తితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అనుకూలంగా ఉండే హ్యాష్‌ట్యాగ్‌పై ట్వీట్ చేస్తే.. ఒక్కో ట్వీట్‌కు 2 రూపాయలు అందుతాయని చెప్పడం వివాదాస్పదమైంది. మే 30న సోషల్ మీడియాలో పబ్లిష్ అయినట్లు తెలుస్తోన్న ఈ వీడియోను యోగీపై అనునిత్యం విమర్శలు గుప్పించే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సూర్య ప్రతాప్ సింగ్ షేర్ చేసి మరోసారి విమర్శలు గుప్పించారు.

కాగా, ఈ విషయమై ఆశీష్ పాండే భార్య, బీజేపీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ప్రీతి స్పందిస్తూ.. ‘‘నా భర్త ఆశీష్‌ పాండేకు యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా గౌరవం. పోలీసులు చెప్పిన కారణాలతో ఆయనకు సంబంధం ఉండదనే అనుకుంటున్నాను. యోగి ఆదిత్యనాథ్ కలవడానికి అనుమతించమని అభ్యర్థిస్తున్నాను, ఒక్క అవకాశాన్ని కల్పిస్తే అసలు ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను’’ డాక్టర్ ప్రీతి ఒక హిందీలో ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే, ఆడియో రెండు వేర్వేరు సంభాషణలను కలపడం ద్వారా వక్రీకరణ జరిగి ఉండవచ్చని పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. తమ దర్యాప్తులో భాగంగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Also…  Ganga River : గంగానదిలో అస్తికలు కలిపేందుకు పోస్టల్‌ శాఖ వినూత్న ప్రయోగం, ​ఓమ్​ దివ్య దర్శన్ ద్వారా మరణానంతర క్రతువు