Crime News: అమానుష ఘటన.. కొడుకుపై కోపంతో.. కోడలిని అమ్మేసిన కసాయి మామ..
కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో కోడలిని ఓ కసాయి మామ రూ. 80 వేలకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని..
కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో కోడలిని ఓ కసాయి మామ రూ. 80 వేలకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మల్లాపూర్ గ్రామంలో నివాసముంటున్న చంద్రరామ్, ప్రిన్స్ తండ్రీకొడుకులు. ప్రిన్స్ తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో చంద్రరామ్ కోడలిపై అక్కసు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రరామ్.. అతడితో రూ.80 వేలకు బేరం కుదుర్చుకుని తన కోడలిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
అతడి దగ్గర నుంచి రూ. 40 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్న చంద్రరామ్.. అందులో రూ. 20 వేలు తన కొడుకు బ్యాంక్ ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా ఇంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని ప్రశ్నించగా.. తన ఆరోగ్యం బాగోలేదని.. కోడలిని కొన్నిరోజులు తన వద్దకు పంపమంటూ చంద్రరామ్ కట్టుకథ అల్లాడు. అది నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారబంకీలో ఉంటున్న తండ్రి దగ్గరకు పంపాడు.
చంద్రరామ్ తన అనుకున్న ప్లాన్ ప్రకారం.. తర్వాతి రోజు తనకి ఆరోగ్యం కుదుటపడిందని.. ఇంటికి వెళ్లమని కోడలికి చెప్పాడు. తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతాడని నమ్మబలకడంతో ఆమె బ్రోకర్‌తో వెళ్లింది. ఇక తండ్రి చేస్తున్న నిర్వాకం తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా గుజరాత్ వెళ్లేందుకు సిద్దంగా ఉన్న నిందితులను బారబంకీ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.
Also Read:
ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..
టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?