Lightning Strikes: ఆ రాష్ట్రంలో పిడుగుపాటు ఘటనలకు 26 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం..

lightning strikes in WB: పశ్చిమ బెంగాల్‌లో ప్రకృతి విలయానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు, పిడుగుల ధాటికి

Lightning Strikes: ఆ రాష్ట్రంలో పిడుగుపాటు ఘటనలకు 26 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం..
lightning strikes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 08, 2021 | 7:46 AM

lightning strikes in WB: పశ్చిమ బెంగాల్‌లో ప్రకృతి విలయానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు, పిడుగుల ధాటికి 26 మంది దుర్మరణం చెందారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన గాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులతో హుగ్లీ జిల్లాలో 11 మంది, ముర్షిదాబాద్‌లో 9 మంది, బంకురా, ఈస్ట్‌ మిడ్నాపూర్‌, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. కాగా.. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.2లక్షల, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం మెరుపు, ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్బా మెడ్నిపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నదియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 37.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన కోల్‌కతాలో సాయంత్రం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతు పవనాల ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read:

Crime News: భార్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్త దిమ్మతిరిగే ప్లాన్.. చివరికి ఊహించని ట్విస్ట్.!

GHMC officer scandal: యువతితో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ కమిషనర్ రాసలీలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ద‌ృశ్యాలు..!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం