Crime News: జగిత్యాల జిల్లాలో దారుణం.. రౌడీషీటర్ హత్య.. కత్తులతో నరికి..
Rowdy Sheeter Murdered: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్
Rowdy Sheeter Murdered: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్(35) దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి బీట్ బజార్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది. శేఖర్‌కు ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు దుండగులు.. ఆ తర్వాత అతనిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. కాగా.. శేఖర్‌పై గతంలోనూ హత్యాయత్నం జరిగినట్లు పేర్కొంటున్నారు.
ఈ ఘటనకు పాత కక్ష్యలే కారణమని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. శేఖర్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రౌడీ షీటర్ హత్య ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.
Also Read: