Telugu Akademi FD scam: తప్పును ఒప్పుకుంది ఐవోబీ.. అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Oct 16, 2021 | 9:16 AM

ఏపీలో ఎఫ్డీల గల్లంతులో తప్పును ఒప్పుకుంది ఐవోబీ. తమ సిబ్బంది హస్తం ఉందని తేలడంతో గిడ్డంగుల సంస్ధ నిధులు తిరిగి ఇచ్చేసింది. అయితే ఆయిల్ ఫెడ్ ఎఫ్డీల విషయంలో మాత్రం అధికారులు..

Telugu Akademi FD scam: తప్పును ఒప్పుకుంది ఐవోబీ.. అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు
Telugu Academy Scam

ఏపీలో ఎఫ్డీల గల్లంతులో తప్పును ఒప్పుకుంది ఐవోబీ. తమ సిబ్బంది హస్తం ఉందని తేలడంతో గిడ్డంగుల సంస్ధ నిధులు తిరిగి ఇచ్చేసింది. అయితే ఆయిల్ ఫెడ్ ఎఫ్డీల విషయంలో మాత్రం అధికారులు, సప్తగిరి బ్యాంక్ మధ్య వివాదం నెలకొంది. నిధులు ఎలా మళ్లించారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. రెండు కేసుల్లోనూ పోలీస్ విచారణ కొనసాగుతోంది. అంతర్గత విచారణ చేపట్టారు రెండు శాఖల అధికారులు. తెలుగు అకాడమీ నుంచి 80 కోట్ల రూపాయల వరకూ కొల్లగొట్టిన ముఠా.. ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిధులు గోల్ మాల్ చేసింది. 2009 నుంచి 2015 మధ్య కాలంలో ఏకంగా 15 కోట్ల రూపాయలు తన జేబుల్లో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ నుంచి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ 5 కోట్లు కాజేశారు.

ఈ రెండు సంస్థలు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకుల్లో మొత్తం 34 ఎఫ్‌.డి.లు చేశాయి ఈ సంస్థలు. అందులో భవానీపురం IOBలో 9 కోట్ల 60 లక్షల రూపాయలుగా గాను ప్రస్తుతం 12 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు అధికారులు. తెలంగాణలో మోసాలు బయటపడటంతో.. ఏపీ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే బ్యాంక్‌ల్లో ఉన్న ఎఫ్.డి.లను చెక్‌ చేయడంతో అందులో ప్రస్తుతం ఉన్న నిల్వల సంగతి తెలిసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

మొత్తం 200 కోట్ల రూపాయల భారీ స్కామ్. రెండు రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. ఈ మొత్తం వ్యవహారంలో.. కీలక సూత్రధారి సాయి కుమార్. ఏపీకి చెందిన సంస్థల ఆఫీసులు హైదరాబాద్‌లో ఉండటంతో నిధులు కాజేసేందుకు స్కెచ్ వేసింది ఈ ఫేక్ ఎఫ్.డి.ల ముఠా. తెలంగాణలో జరిగిన మోసంలో తెలుగు అకాడమీకి చెందిన వ్యక్తులు, బ్యాంక్ అధికారులు, బ్రోకర్లు అంతా కలిసి దోచేశారు. అయితే ఏపీలో ఫేక్ ముఠాకు సహకరించింది ఎవరు? బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా కోట్ల రూపాయలు ఎలా గల్లంతవుతాయనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.

ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu