Punjab Police: ఉగ్ర కుట్ర భగ్నం.. పెద్ద ఎత్తున విదేశీ పిస్టళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్
Terror Plan Foiled: పంజాబ్ పోలీసులు పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున విదేశీ పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని
Terror Plan Foiled: పంజాబ్ పోలీసులు పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున విదేశీ పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాదుల కోసం స్మగ్లింగ్ చేసిన ఆయుధ స్మగ్లర్‌ను అరెస్టు చేసి.. పెద్ద ఎత్తున విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గుప్తా వెల్లడించారు. పంజాబ్ అమృతసర్ లోని కథునంగల్ సమీపంలో బటాలా జిల్లా నివాసి జగ్జిత్ సింగ్ (25) ను పంజాబ్ అంతర్గత భద్రతా విభాగం అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని నుంచి రెండు నైలాన్ సంచుల్లో 48 విదేశీ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటలీ, చైనా, టర్కీ దేశాల్లో తయారైన అధునాతన పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మాజీ గ్యాంగ్ స్టర్ డర్మాన్ పిస్టళ్లను జగ్జిత్ సింగ్‌కు పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థలతో అమెరికా, కెనడా, యూకే కేంద్రంగా ఉన్న ఖలిస్థానీ అనుకూలవాదులు విదేశీ పిస్టళ్లను పంజాబ్ స్మగ్లర్ జగ్జిత్ సింగ్‌కు పంపించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పిస్టళ్లు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు.. చేరవేశారని ఈ ఉగ్ర కుట్రను పోలీసులు ముందస్తుగానే అడ్డుకున్నట్లు డీజీపీ గుప్తా వివరించారు.
Also Read: