Araku MLA Murder case: ‘కిడారి’ హత్య కేసులో ఆమె సూత్రధారి.. మావోయిస్టు భవానీపై ఎన్ఐఏ ఛార్జిషీట్..
Araku MLA murder case: ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల క్రితం జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సాకే
Araku MLA murder case: ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల క్రితం జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్ భవానీ (45) ని ఎన్‌ఐఏ.. నిందితురాలిగా గుర్తించింది. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని జాతీయ పరిశోధన సంస్థ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెపై సెక్షన్ 302తోపాటు అన్‌లాఫుల్ చట్టంలో సెక్షన్ 18, 20, 38, 39, ఇంకా ఆయుధాల చట్టంలోని 25(1ఏ) సెక్షన్‌ను నమోదు చేసింది. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో 2018 సెప్టెంబరు 23న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. తరువాత ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టి 2018 డిసెంబరు కేసు నమోదు చేసింది.
ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే తొమ్మిది మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. తాజాగా షేక్ కళావతి పేరును చేర్చింది. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టులు కాకూరి పెద్దన్న, కళావతి 15 రోజులు ముందుగా డుంబ్రిగుడ చేరుకుని ప్రణాళిక రూపొందించినట్టు ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. ఇందుకోసం 40 మంది సభ్యులతో శిబిరం నిర్వహించినట్టు తెలిపింది. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యకు సంబంధించి మావోయిస్టు బృందానికి భవానీ అవసరమైన లాజిస్టిక్స్‌ను ఆమె అందించినట్టు అభియోగం మోపింది.
Also Read: