AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌.. సీబీఐ విచారణలో బయటపడుతున్న కొత్త కోణాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌.. సీబీఐ విచారణలో బయటపడుతున్న కొత్త కోణాలు
Ys Vivekananda Reddy Murder Case Cbi Enquiry
Balaraju Goud
|

Updated on: Jun 12, 2021 | 9:13 AM

Share

CBI Enquiry in YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కరిని విచారిస్తే మరో కొత్త క్లూ అన్నట్టుగా.. మరొకరికి దగ్గరికి వెళ్తోంది. ఇలా సీబీఐ చేపట్టిన విచారణ కొద్ది రోజులుగా వేగంగా సాగుతోంది.

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా విచారణ కొనసాగించారు. విచారణకు వివేకా మాజీ డ్రైవరు దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌యాదవ్‌, రవాణాశాఖ సిబ్బంది హాజరయ్యారు. హత్య జరగడానికి 15 రోజుల ముందు వివేకాను కిరణ్‌కుమార్‌యాదవ్‌ కలిసినట్లు సీబీఐ వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

హత్య జరిగిన రోజు వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీనికి బలం చేకూర్చేందుకు AP-04-1189 నెంబర్‌ గల ఇన్నోవా వాహనం ఓనర్‌ అయిన అరకటవేముల రవి, డ్రైవర్‌ గోవర్ధన్‌లను కలిపి విచారణ చేశారు. వీరి ద్వారా వచ్చిన ఇన్‌ఫర్మేషన్‌ను రికార్డు చేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇన్నోవా వాహనం యజమానిని సీబీఐ అధికారులు విచారించినట్టు సమాచారం.

దీంతో ఈ కేసు విచారణలో కీలకంగా మారింది ఇన్నోవా కారు. హత్యకు ముందు ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఇనాయతుల్లాను విచారించారు. అటు తర్వాత సునీతారెడ్డితో కలిసి వివేకా నివాసాన్ని పరిశీలించారు సీబీఐ అధికారులు. ఇలా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. ఈ కేసులో పలువురు అనుమానితులను మాత్రమే ప్రశ్నిస్తున్న సీబీఐ, ఇప్పుడు కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ను కూడా విచారించి ఈ కేసులో పలు వాహనాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

నాలుగు విడతలుగా సాగుతున్న ఈ కేసును ముందుగా కడప, పులివెందుల, ఢిల్లీ కేంద్రంగా విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు వరకు అనుమానితులను, వివేకాఅనుచరులను, సన్నిహితులును సీబీఐ అధికారులు విచారించగా, ఇప్పుడు మాత్రం జిల్లా స్థాయి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌, బ్రేక్ఇన్స్పెక్టర్, ట్రాన్స్‌పోర్ట్‌ సిబ్బంది సీబీఐ ఎదుట హాజరయ్యారు.

వివేకా హత్య జరిగే ముందు రోజు కొన్ని అనుమానిత వాహనాలు రిజిస్టేషన్‌ నెంబర్‌ లేని వాహనాలు ఇంటి పరిసరప్రాంతాల్లో తిరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ వాహనాలకు సంబంధించి వివరాలును అడిగి తెలుసుకోవడం కోసం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ను పిలిపించి వివరాలు రాబట్టారు. ఇప్పుడు వీరు ఇచ్చిన సమాచారమే ఈ కేసులో కీలకంగా మారనుంది. నిన్న సీబీఐ అధికారుల ఎదుట హాజరైన ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ 10 నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరికొందరు అధికారుల దగ్గర కీలక సమాచారం సేకరించారు.

మరోవైపు గత కొన్ని నెలలుగా వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని కూడా సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో వివేకానంద కేసులో కీలక సమాచారం లభించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also…  Etela Rajender Resign: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల నేటితో గుడ్‌బై.. స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న రాజేందర్