Etela Rajender Resign: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల నేటితో గుడ్‌బై.. స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న రాజేందర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పిస్తారు.

Etela Rajender Resign: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల నేటితో గుడ్‌బై.. స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న రాజేందర్
Etela Rajender Likely To Join Bjp
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 12, 2021 | 10:36 AM

Etela Rajender Resignation for MLA: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. అలాగే, ఈనెల 14న కషాయం కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు ఈటల. దీంతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి.

మంత్రి వర్గ భర్తరఫ్‌తో టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తన రాజకీయ మలిదశ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీలో కొనసాగించేందుకు సిద్దమయ్యారు. ఇదే క్రమంలో ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిసి భవిష్యత్ కార్యచరణ రూపోందించారు. దీంతో ఢిల్లి వెళ్లి ముహుర్తం ఖారారు చేసుకున్నారు. సోమవారం బీజేపీ తీర్థం తీసుకునేందుకు రెఢి అయిన ఈటల రాజేందర్ రెండు రోజుల ముందుగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో నేడు స్పీకర్ కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు..

కాగా, సోమవారం బీజేపీలో చేరేందుకు ఈటల ముహుర్తం ఖరారు కావడంతో ఆరోజు ఉదయమే ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు బిజెపి వర్గాలు వెళ్లడించాయి.ఇక ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌లు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా వెంట వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పై అసైన్డ్‌భూముల కొనుగోలు ఆక్రమణలు చేశారంటూ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. వెంటనే సీఎం సీఎస్ అధ్యర్యంలో రెవెన్యు, విజిలెన్స్ కమిటిలు వేసి అత్యవసరంగా విచారణ జరిపించారు.. దీంతో రాజకీయంగా దెబ్బతీయడంతో ఆత్మభిమానాన్ని దెబ్బ తీసే కుట్రకు సీఎం తెరలేపారని ఈటల రాజేందర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు…

దీంతో పార్టీతో పాటు ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని అంతా భావించారు. ఉద్యమంలో నుండి మరో పార్టీ వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం తాను ఏనాడు కొత్త పార్టీ పెట్టేందుకు ఆలోచించలేదని స్పష్టం చేస్తూనే అందరి అంచనాలను తలకిందులు చేసి బీజేపీలో చేరేందుకు సన్నద్దమయ్యారు. దీంతో ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపి సోమవారం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తన అనుచరగణంతో సోమవారం బీజేపీ ప్రాధమిక సభ్యత్వం నడ్డా చేతుల మీదుగా తీసుకోనున్నారు. Read Also…  Boy life Safe: మూడేళ్ల చిన్నారి ప్రాణం నిలిపిన ఇంజక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు