Viral Video: ఓర్నీ తెలివి తెల్లారా!.. ఏకంగా కారు పొగ గొట్టంతో కబాబ్ వండాడు.. చివరికి ఏమైందంటే.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోవడంతో.. ప్రపంచ నలుమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్ల ముందుంటున్నాయి....

Viral Video: ఓర్నీ తెలివి తెల్లారా!.. ఏకంగా కారు పొగ గొట్టంతో కబాబ్ వండాడు.. చివరికి ఏమైందంటే.!
Lamborghini
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2021 | 9:51 AM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోవడంతో.. ప్రపంచ నలుమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్ల ముందుంటున్నాయి. ఇక ప్రపంచంలో చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసేవాళ్లకు కొదవలేదు. వారి చేసే కొన్ని స్టంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే.. మరికొన్ని ఫెయిల్ అయి లైఫ్‌‌‌ను రిస్క్‌లో పెట్టేసేలా ఉంటాయి. అలాంటి ఓ స్టంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఓ వ్యక్తి లంబోర్గినీ కారు ఎగ్జాస్ట్ నుంచి వచ్చే మంటలతో కబాబ్‌ను గ్రిల్ చేయాలని చూస్తాడు. కానీ ఆ స్టంట్ కాస్తా ఫెయిల్ అయి కారులోని ఒక్కసారిగా పొగలు బయటికి వచ్చాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకోగా.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చైనా హునాన్ ప్రావిన్స్‌లోని ఓ కారు గ్యారేజీలో ఉంది. అందులో పని చేసే కొంతమంది కుర్రాళ్లు లంబోర్గినీ ఎగ్జాస్ట్ మంటలతో కబాబ్ వండితే.. ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ తుంటరి స్టంట్‌కు తెరలేపారు. ఓ వ్యక్తి లంబోర్గినీ కారు ఎగ్జాస్ట్ దగ్గర చేతిలో స్క్యూవర్‌తో దానికి మాంసం ముక్కను గుచ్చి రెడీగా ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఇక మరో వ్యక్తి కారు ఎక్కి.. V12 ఇంజిన్‌ను ఫుల్ రైజ్ చేశాడు. అతడు రైజ్ చేసిన దెబ్బకు ఎగ్జాస్ట్ నుంచి ఏకంగా మంటలు బయటకు వచ్చాయి. దాని నుంచి కబాబ్‌ను గ్రిల్ చేయాలని ప్రయత్నించాడు. అయితే ఇంతలోనే కారులో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వచ్చేయడంతో పాటు ఎరుపు రంగులోని కూలంట్ ద్రవం ఒక్కసారిగా లీకైంది. దీనితో అందరూ షాక్ అయ్యారు.

మంటల వల్ల కారులోని ప్లాస్టిక్ కూలంట్ ట్యాంక్ బద్దలై లిక్విడ్ లీకైందని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు తిట్లతో హోరెత్తిస్తున్నారు. కోట్లు విలువ చేసే కారుతో ఈ పనికిమాలిన పనులేంటని కామెంట్స్ రూపంలో తిట్టిపోస్తున్నారు.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే