AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: కోవిడ్ తగ్గినా మానసిక ఆందోళనకు గురవుతున్నారా? అయితే కొత్త మార్గంలో మిమ్మల్ని మీరే ట్రీట్ చేసుకోండి..

Covid 19: కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు వివిధ రకాల...

Covid 19: కోవిడ్ తగ్గినా మానసిక ఆందోళనకు గురవుతున్నారా? అయితే కొత్త మార్గంలో మిమ్మల్ని మీరే ట్రీట్ చేసుకోండి..
Covid Effect
Shiva Prajapati
|

Updated on: Jun 12, 2021 | 8:03 AM

Share

Covid 19: కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ ప్రజలను బాధిస్తోంది. కోవిడ్ -19 బారిన పడి దాని నుండి కోలుకున్న తరువాత, చాలా మంది ప్రజలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు శాస్త్రవేత్తలు డిప్రెషన్‌లో ఉన్న వారిపై పరిశోధనలు జరిపారు. వీరు డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సరికొత్త చికిత్సను కనుగొన్నారు.

చికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.. గ్యాస్ సహాయంతో డిప్రెషన్‌కు చికిత్స చేసే కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు నైట్రస్ ఆక్సైడ్ తీసుకోవడం ద్వారా వారిలోని ఒత్తిడిని తగ్గించవచ్చు అని చెబుతున్నారు. అంటే రెండు వారాల పాటు.. ఫన్ గ్యాస్(నైట్రస్ ఆక్సైడ్) వారికి ఇవ్వాలని చెబుతున్నారు. యాంటీ డ్రిపెషన్ గ్యాస్ ఔషధాలు ఇవ్వడం ద్వారా వారిలోని మానసిక ఆందోళనలను తొలగించవచ్చునని నిరూపించారు.

నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏమిటి? నైట్రస్ ఆక్సైడ్.. దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది రసాయన సమ్మేళనం. ఇది పరమాణు ఆక్సిజన్‌తో సమానమైన శక్తివంతమైన ఆక్సిడైజర్. శ్వాసపై శక్తినిచ్చే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే డిసోసియేటివ్ ఎస్తెటిక్ గా పని చేస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎసెన్షియల్ మెడిసిన్స్ జాబితాలో ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన సురక్షితమైన మరియు అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా లిస్ట్ చేయడం జరిగింది.

అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్యాస్ ఇవ్వవచ్చు.. 1. శాస్త్రవేత్తల ప్రకారం, 25 శాతం మంది రోగులు లాఫింగ్ గ్యాస్‌ను స్మెల్ చేశారు. 2. చికిత్సలో ప్రభావవంతమైన దీర్ఘకాలిక ఫలితాలను చూపించింది. అయినప్పటికీ, ఈ గ్యాస్‌ని పీల్చుకోవడం వల కొన్ని చిన్న దుష్ప్రభావాలు ఉన్నాయి. 3. అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు కూడా లాఫింగ్ గ్యాస్ ఇవ్వవచ్చు. 4. యాంటీ-డిప్రెషన్ ఔషధం తటస్థంగా ఉంది. 5. పరిశోధకుడు చార్లెస్ కాన్వే ప్రకారం.. డిప్రెషన్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో యాంటీ-డిప్రెషన్ మందులు పనిచేయవు. అయితే, ఇవి ఎందుకు పనిచేయడం లేదు అనే దానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఆ కారణంగా, రోగులు సంవత్సరాలుగా నిరాశతో పోరాడుతూనే ఉన్నారు. 6. లాఫింగ్ గ్యాస్‌కు చికిత్స చేసే కొత్త పద్ధతి ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. 7. 25% గ్యాస్ ట్రీట్‌మెంట్ మరింత ప్రభావవంతమైన ఫలితాలను చూపుతుంది 8. పరిశోధకుడు, అనస్థీషియాలజిస్ట్ పీటర్ నాగెల్ ప్రకారం.. అధ్యయనంలో 24 మంది రోగులు గంటకు ఒకసారి గ్యాస్ పీల్చుకోవలసి వచ్చింది. 9. ఈ ప్రక్రియలో, నైట్రస్ వాయువు స్థాయి 25 మరియు 50 శాతం వద్ద స్థీకరించడం జరిగింది. 10. 25 శాతం స్థాయిలో గ్యాస్ పీల్చుకున్న రోగుల్లో 50 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది. 11.అంతేకాదు.. దుష్ప్రభావాలు తక్కువగా కనిపించాయి. రోగుల పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది.

Also read:

Agriculture: వ్యవసాయం రగంలో సరికొత్త ప్రయోగం.. డిఎస్ఆర్ టెక్నాలజీతో వరి నాట్లు.. 20% నీరు ఆదా..