AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: కోవిడ్ ఆసుపత్రిపై జగన్ సర్కార్ కొరడా.. ఎన్నడూ లేని విధంగా దిమ్మతిరిగే ఫైన్

Covid-19 Hospital: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో

Kakinada: కోవిడ్ ఆసుపత్రిపై జగన్ సర్కార్ కొరడా.. ఎన్నడూ లేని విధంగా దిమ్మతిరిగే ఫైన్
Kakinada Covid 19 Hospital
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2021 | 6:48 AM

Share

Covid-19 Hospital: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు పెడచెవిన పెడుతున్నాయి. వైద్యం పేరుతో రూ.లక్షలు దోచుకుంటున్నాయి. చివరికి బిల్లు కడితేనే రోగి శవాన్ని ఇస్తున్నాయి. అలా లక్షలకు లక్షలు వసూలు చేసినా.. ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ కొరడా ఝుళిపించింది. క్రిమినల్ కేసు నమోదు చేసి ఇప్పటివరకూ విధించనటువంటి భారీ ఫైన్ విధించింది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓబిలిశెట్టి సత్యనారాయణకు కరోనా సోకగా.. అతన్ని మే 14 న.. సాయిసుధా ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం సాయి సుధా ఆసుపత్రి కోవిడ్ చికిత్సకు రూ.14 లక్షలు వసూలు చేసిందని బాధితుల కుటుంబసభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసినట్లు.. తేలడంతో జిల్లా అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆసుపత్రి యాజమాన్యంపై కాకినాడ త్రీటౌన్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరోగ్య శ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ చేకూరి కీర్తి సమక్షంలో విచారణ జరిపి ఈ భారీ జరిమానా విధించారు.

బాధితుల దగ్గరి నుంచి రూ.3.16 లక్షలే తీసుకోవాల్సి ఉండగా.. ఆసుపత్రి యాజమాన్యం మొత్తం రూ.10.84 లక్షలను వసూలు చేసినట్లు నిర్ధారించారు. దీనికి ఏడు రెట్లు రూ.75.780 లక్షల జరిమానా విధించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ నగదుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ డీ. మురళీధర్ రెడ్డికి అందించింది. దీంతోపాటు బాధితుల నుంచి వసూలు చేసిన రూ.10.84 లక్షలను కూడా బాధితులకు అందించారు.

Also read:

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…

TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!