AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…

మందుబాబుల కష్టాలు తీరిపోయాయి. మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సిన పని లేకుండా పోయింది. లిక్కర్​ను నేరుగా ఇంటివద్దకే సరఫరా చేసేలా ఎక్సైజ్ నిబంధనలను...

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్...
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2021 | 10:41 PM

Share

మందుబాబుల కష్టాలు తీరిపోయాయి. మద్యం షాపుల ముందు క్యూ కట్టాల్సిన పని లేకుండా పోయింది. లిక్కర్​ను నేరుగా ఇంటివద్దకే సరఫరా చేసేలా ఎక్సైజ్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు భారీ స్పందన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో దేశ రాజధానిలో శుక్రవారం నుంచి మొబైల్ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్​ ఆర్డర్లు చేసుకోవచ్చు. నిబంధనలు అమలులోకి వచ్చినప్పటికీ.. కావల్సిన లిక్కర్ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ హోం డెలివరీ ఫుల్ టు ఫుల్ సక్సెస్ అయ్యాలా ఉంది. మద్యం ప్రియులు ఇక నుంచి మొబైల్ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్​ను బుక్ చేసుకునే విధంగా.. సవరించిన ఎక్సైజ్​ నిబంధనలను ఢిల్లీ సర్కార్​ నోటిఫై చేసిన సంగతి తెలిసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గురవారం విడుదల కాగా.. ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు ఎందుకు లేదు? గత ఎక్సైజ్​ నిబంధనల ప్రకారం ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా చేసిన లిక్కర్​ ఆర్డర్లుకు మాత్రమే హోం డెలివరీ చేసే వెసులుబాటు ఉండేది.

ఈ నిబంధనలు అసాధారణంగా ఉన్నందున ఎల్​-13 లైసెన్స్ తీసుకునెేందుకు ఇప్పటివరకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అందుకే ఒక్క లైసెన్స్ కూడా జారీ కాలేదు.సవరించిన నిబంధనల్లో ఏముంది?సవరించిన నిబంధనల ప్రకారం మొబైల్​ యాప్, వెబ్​సైట్ల ద్వారా లిక్కర్ ఆర్డుర్లు తీసుకొని హొం డెలివరీ చేయొచ్చు. ఇందుకోసం ఢిల్లీ ఎక్సైజ్​ నిబంధనల్లోని రూల్​ 66ను ప్రభుత్వం మార్చింది.

ఇందుకు సంబంధించిన గెజిట్​ నోటిఫికేషన్​ను సోమవారమే విడుదల చేసింది. ఎక్కడికైనా సరఫరా చేయొచ్చా? నూతన నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన వారు బహిరంగ ప్రదేశాలు, టెర్రస్​, క్లబ్బుల్లోని కోర్టు యార్డులు, హోటల్ అనుబంధ బార్లు, రెస్టారెంట్లకు లిక్కర్ సరఫరా చేయొచ్చు. బాటిళ్లలోనూ ఆల్కహాల్​ పొందే సదుపాయం కస్టమర్లకు ఉంటుంది.అమల్లోకి వచ్చిందా?నిబంధనలు శుక్రవారం నుంచి మారినప్పటికీ అమలు కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన షరతులను ప్రభుత్వం తెలపకపోవడమే ఇందుకు కారణం.

ఇవి కూడా చదవండి : Curd and Raisins:పెరుగు-ఎండుద్రాక్ష తినండి.. అది చేసే మ్యాజిక్ ప్రయోజనాలను చూడండి!

Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!