Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..

PK MEET Sharad Pawar: ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ ఇంట్లో ప్రశాంత్‌ కిశోర్‌ లంచ్‌ చేయడం పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. మిషన్‌ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు

Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..
Prashant Kishor Meets Shara
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 11, 2021 | 8:03 PM

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయ చిత్రం ఒక్కసారిగా వేడెక్కుతోంది. కరోనా సెకెండ్ వేవ్ కొద్దిగా తగ్గుతుండటంతో పొలిటికల్ చదరంగా మొదలైంది. దేశ రాజధాని కేంద్రంగా కమలనాథులు వ్యూహం పన్నుతుంటే.. మరో వైపు హైట్రిక్ విజయంను అందుకుని తెగ జోష్‌లో ఉన్న బెంగాల్ సీఎం మమతా… తృణమూల్ కాంగ్రెస్‌(TMC)లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌ మొదలు పెట్టింది. అయితే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మరో ఎత్తుగడకు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ ఇంట్లో ప్రశాంత్‌ కిశోర్‌ లంచ్‌ చేయడం పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. మిషన్‌ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు దేశ రాజధానిని చుట్టేస్తున్నాయి. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు తెలియక పోయినా.. జరగబోయే పొలిటికల్ మ్యాప్ అందరికి కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్ తన వ్యూహాలతో మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరివురికి మద్దతు ప్రకటించిన నేతలందరినీ కలిసి ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలపనున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే నేడు పవార్‌ను కలుస్తున్నట్లు పేర్కొన్నాయి.

కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం పవార్‌, ప్రశాంత్‌ భేటీ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. ‘మిషన్‌-2024’ టార్గెట్‌గానే ఈ సమావేశం జరగనున్నట్లు పొలిటికల్ సెంటర్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఎన్నికల వ్యూహరచన’ నుంచి తప్పుకోనున్నట్లు ప్రశాంత్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాను విఫలమైన రాజకీయ నాయకుడిని అంటూ చెప్పుకుంటున్న పీకే… మరో ఎత్తుగడతో దేశ రాజకీయాల్లో తుఫాన్ సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే