West Bengal Politics: సువేందు వస్తే టీఎంసీలో చేర్చుకుంటారా?.. మమతా బెనర్జీ రియాక్షన్ ఏంటో తెలుసా?
West Bengal Politics: మళ్ళీ మా దగ్గరకు రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ, వారిని తిరిగి రానిచ్చే పరిస్థితి లేదు అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విస్పష్టంగా చెప్పారు.
West Bengal Politics: మళ్ళీ మా దగ్గరకు రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ, వారిని తిరిగి రానిచ్చే పరిస్థితి లేదు అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విస్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు తనను పార్టీ నుంచి వెళ్ళిపోయి.. తనను అవమాన పరిచిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ్ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఆయన తనయుడు సుభ్రాన్షు రాయ్ తిరిగి తృణమూల్ లో చేరారు. మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం సాయంత్రం వారిద్దరూ సొంతగూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మమతా మీడియాతో మట్లాడారు. ముకుల్ రాయ్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. అయన ఎప్పుడూ టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. బీజేపీలో ఆయనను బెదిరించడంతో ఆయన అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. తమ పార్టీ ఎటువంటి కుంభకోణాలకూ పాల్పడలేదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఎన్నికల ముందు బీజేపీలో చేరిన వారిని పార్టీలోకి తిరిగి తీసుకోబోమని ఆమె చప్పారు. ముకుల్ రాయ్ టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తారని ఆమె ప్రకటించారు.
మమతను యావత్ దేశానికి నాయకురాలిగా ముకుల్ రాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో బెంగాల్ బీజేపీలో ఎవరో ఉండలేరని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నిజానికి ఈయన బీజేపీని వీడి సొంతగూటికి చేరుతారనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చాలా రోజుల నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గోవటం లేదు. దీనిపై బీజేపీ వర్గాలు మాత్రం ముకుల్ భార్య అనారోగ్య రీత్యా ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడంలేదని చెప్పుకోచ్చేవారు. మూడు నాలుగు రోజుల నుంచి ముకుల్ రాయ్, ఆయన కుమారుడు సుభ్రాన్షు రాయ్ టీఎంసి తీర్థం పుచ్చుకోబోతున్నరనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపు ప్రధాని మోడీ గురువారం ముకుల్ రాయ్ తొ స్వయంగా మాట్లాడారు. దీంతో అయన పునరాలోచనలో పడ్డారని చెప్పుకున్నారు. కానీ, ఆయన స్వంత గూటికి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నారు.
ఇక బీజేపే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. అక్కడ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న.. తృణమూల్ నుంచి బీజేపీలో ఎన్నికల ముందు చేరిన సువేందు అధికారి కూడా తిరిగి స్వంత గూటికి చేరాలని చూస్తున్నారని చెప్పుకున్నారు. అయితే, ముకుల్ రాయ్..సువేందు మధ్య ఉన్న విబేధాలు..మమతా పై ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు చేసిన చరిత్ర ఉన్న సువేందును తిరిగి దీదీ రానిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికల్లో టీఎంసీ గెలుపుతో చాలా మంది బీజేపీ నాయకులు మళ్ళీ టీఎంసి గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, టీఎంసీలో అంతర్గతంగా ఈ విషయంపై నడుస్తున్న చర్చల్లో దీనికి మెజార్టీ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పుడు మమతా చేసిన ప్రకటనతో కొంతవరకూ క్లారిటీ వచ్చింది. ఎవరైతే తృణమూల్ లేదా మమతాను ఎన్నికల ప్రచారంలో విమర్శించాలేదో వారిని మాత్రమె పార్టీలోకి తీసుకునేందుకు మమతా సుముఖత తొ ఉన్నవిషయం తెలుస్తోంది. ఇప్పడు ఎంతమంది జంప్ కొడతారో వేచి చూడాల్సిందే.
Also Read: Mission 2024: పవార్‌తో పీకే మంత్రాంగం.. ఈ సారి సునామీ ఉంటుందంటున్న ఢిల్లీ వర్గాలు..
YSRCP: ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి.. లోక్‌సభ స్పీకర్‌ను కోరిన ఎంపీ భరత్