AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపీటల మీది నుంచి డైరెక్ట్ కటాకటాల్లోకి వరుడు… అసలు ఏం జరిగిందంటే..

పెళ్లి... రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలను కలుపుతుంది. ప్రతి ఒక్కరు తమ పెళ్లి వేడుకలు

పెళ్లిపీటల మీది నుంచి డైరెక్ట్ కటాకటాల్లోకి వరుడు... అసలు ఏం జరిగిందంటే..
Wedding
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2022 | 6:27 PM

Share

పెళ్లి… రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య సంబంధాలను కలుపుతుంది. ప్రతి ఒక్కరు తమ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరగాలని కోరుకుంటారు. ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఎన్నో కళలు కంటారు. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఇక పెళ్లిలో బ్యాండ్.. డీజే ఉండడం కూడా సర్వసాధారణం.. కానీ ఇక్కడ ఓ పెళ్లిసందడిలో డీజే చిచ్చు పెట్టింది. రెండు పెళ్లి బరాత్‌ల నడుమ చెలరేగిన వివాదంతో ఓ పెళ్లికొడుకుని జైలుపాలు చేసింది. పెళ్లి మండపంలో తాళికట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు..పెళ్లిపీటల మీదనుంచే వరుడిని నేరుగా కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

మార్చి 23 న దిల్వాపూర్ మండలం కాల్వతండాలో జరిగిన ఘర్షణ తీవ్ర సంచలనం రేపింది. రెండు పెళ్లి బారాత్ ల మద్య డీజీ వివాదంతో రెండు గ్రూప్‌లు తన్నుకున్నాయి.. మెగావత్ రాజు కుటుంబానికి బానావత్ సాయికుమార్ కుటుంబానికి మద్య పాతకక్షలతో పరస్పరం దాడులకు దిగారు.. వైరి వర్గాలైన మెగావత్ రాజు, బానావత్ సాయికుమార్ ఇద్దరి పెళ్లిల్లు ఒకే రోజు జరగడంతో డీజే సౌండ్ ల విషయంలో గొడవ తలెత్తింది.. పాత కక్షలను మనసులో పెట్టుకుని డీజే సౌండ్ తగ్గించాలంటూ వచ్చిన మరో పెళ్లి కొడుకు మెగావత్ రాజు బంధువైన మెగావత్ నవీన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. నవీన్‌ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల కారణంగా స్నేహితులతో కలిసి మెగావత్ నవీన్ అనే యువకుడిని పెళ్లి బారాత్ లో చితక బాది హత్య చేసిన పెళ్లి కొడుకు బానావత్ సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

RRR Movie: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకర్స్.. అలా చేయెద్దంటూ విన్నపం..

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌