Black Fungus: బ్లాక్‌లో ‘బ్లాక్ ఫంగస్’ ఇంజెక్షన్లు.. హైదరాబాద్‌లో రెండు ముఠాల గుట్టురట్టు.. 

Black Fungus Medicine: కరోనా కాలంలో మెడికల్ క్రిమినల్స్ దందా రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో

Black Fungus: బ్లాక్‌లో ‘బ్లాక్ ఫంగస్’ ఇంజెక్షన్లు.. హైదరాబాద్‌లో రెండు ముఠాల గుట్టురట్టు.. 
Black Fungus Medicine
Follow us

|

Updated on: Jun 17, 2021 | 5:45 PM

Black Fungus Medicine: కరోనా కాలంలో మెడికల్ క్రిమినల్స్ దందా రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి దందాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే ఆంపిటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి 28 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.7వేలు ఉండే ఒక్కో ఇంజెక్షన్‌ను ఈ ముఠా రూ.35వేల నుంచి 50వేల వరకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈమేరకు హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు నిందితులను వల పన్ని పట్టుకున్నారు. మొదటి ముఠాలో మెడికల్‌ రిప్రజెంటిటివ్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ పలువురి నుంచి కమిషన్‌పై ఇంజెక్షన్లు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను మరో నలుగురితో కలిసి దందా నిర్వహిస్తున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివరించారు. రెండో ముఠాలో బాలస్వామి ప్రధాన నిందితుడని తెలిపారు. అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. గుంటూరుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు.

Also Read:

Viral Video: వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!

Podu Farming : వర్షాల రాకతో తెలంగాణలో పోడు పోరు మళ్లీ మొదలు.. నేతలు సైతం రంగంలోకి దిగడంతో అట్టుడుకుతోన్న అడవి తల్లి.!