FIR on Baba Ramdev: మరో కేసులో ఇరుక్కున్న రాందేవ్ బాబా.. వైద్యుల ఫిర్యాదు మేరకు రాయ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు

యోగ గురు బాబా రాందేవ్‌పై మరో కేసు నమోదైంది. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులపై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

FIR on Baba Ramdev: మరో కేసులో ఇరుక్కున్న రాందేవ్ బాబా.. వైద్యుల ఫిర్యాదు మేరకు రాయ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు
Baba Ramdev
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 17, 2021 | 6:28 PM

FIR against Baba Ramdev: అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయుర్వేద వైద్య విధానం వర్సెస్ అల్లోపతి వైద్యం అన్నట్లుగా సాగుతోంది. ఎప్పట్నించో ఉన్న వివాదమే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. అల్లోపతి వైద్యంపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహానికి గురైన యోగా గురు రాందేవ్ బాబా.. ఆ తర్వాత అల్లోపతిపై ప్రశంసలు కురిపించినప్పటికీ చిక్కులు మాత్రం వీడేలా కనిపించడం లేదు.

తాజాగా యోగ గురు బాబా రాందేవ్‌పై మరో కేసు నమోదైంది. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులపై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐఏంఏ చత్తీస్‌గఢ్ యూనిట్‌ ఫిర్యాదుపై రామకృష్ణ యాదవ్ అలియాస్ రాందేవ్‌పై కేసు నమోదైనట్టు రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనతోందని వెల్లడించారు. రాందేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో హాస్పిటల్ బోర్డ్ ఐఎంఏ (సీజీ) చైర్మన్ డాక్టర్ రాకేశ్ గుప్తా, ఐఎంఐ రాయ్‌పూర్ అధ్యక్షుడు వికాశ్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.

అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని…ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని బాబా రాందేవ్ గుర్తు చేశారు. అంతేకాదు కొన్ని వ్యాధులను నయం చేసేందుకు అలోపతిలో ఔషథాలే లేవని విమర్శించారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే..వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా వైద్యులు తప్పుబట్టారు. దీంతో పలు పోలీసు స్టేషన్లలో బాబా రాందేవ్‌పై కేసులు నమోదు చేశారు.

Read Also…  

Corona Vaccination: త్వరలో పలు విదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం.. ఏ టీకాలు ఎప్పటిలోగా వస్తాయి?

MP Vijayasai Reddy: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు