MP Vijayasai Reddy: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ త్వరలో విశాఖకు వస్తుందని.. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ, రాజధాని త్వరలో రావడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

MP Vijayasai Reddy: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలింపుపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Vijayasai Reddy
Follow us

|

Updated on: Jun 17, 2021 | 5:52 PM

YCP MP Vijayasai Reddy Comments on Executive Capital: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా ఏర్పడబోతోందని కొంతమంది మంత్రులు, ఎంపీలు అంటున్నారు. ఏక్షణమైనా విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ త్వరలో విశాఖకు వస్తుందని.. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ, రాజధాని త్వరలో రావడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో కసరత్తు కొనసాగుతున్నట్లు దీనికి సంబంధించిన సంకేతాలు అందుతున్నాయన్నారు.

అలాగే, వాల్యు బేసిడ్ టాక్స్ విధానం అనేది దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమని, దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానం దేశ వ్యాప్తంగా అమలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయమన్నారు. కొత్త దీనివల్ల వచ్చే ఏమి ఉండదన్న ఆయన.. 15శాతంకు మించి టాక్స్ పెరగదన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుగా తీసుకున్న నిధులు తెచ్చుకున్నప్పుడు గ్యారెంటీ ఇవ్వడం సర్వ సాధారణమన్న విజయసాయిరెడ్డి.. ఈ ప్రక్రియ కొత్తది కాదన్నారు. స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి అమలులో ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొత్తగా ఈ పద్ధతి అమలు చేస్తోందని దుష్ప్రచారం జరుగుతోందన్నారు.

ఇక, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో జోన్‌లో ఒక్కో కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు. అలాగే, జేఎన్ఎన్‌యుఆర్ఎం, ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి మరమత్తుల నిమిత్తం ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు అందిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Read Also…  CM YS Jagan: పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఉద్యోగులను తొలగించేదీలేదు.. రెండేళ్లలో అన్ని స్కూళ్లల్లో మౌలిక సౌకర్యాలు పూర్తిః సీఎం జగన్