Mumbai Fake Notes: ముంబైలో పట్టుబడిన నోట్ల కట్టల గుట్టలు.. అన్నీ ఫేక్ నోట్స్..

మహారాష్ట్రలో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. నకిలీ నోట్లను ముద్రించి పంపిణీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురిని ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ..

Mumbai Fake Notes: ముంబైలో పట్టుబడిన నోట్ల కట్టల గుట్టలు.. అన్నీ ఫేక్ నోట్స్..
Mumbai Fake Notes
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 26, 2022 | 11:20 PM

మహారాష్ట్రలో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. నకిలీ నోట్లను ముద్రించి పంపిణీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురిని ముంబై పోలీసులు(Mumbai Police Crime Branch) బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్ధిష్ట సమాచారం మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్-11 మంగళవారం సాయంత్రం శివారులోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద కారును అడ్డగించిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు కారు సీట్ల కింద  సోదాలు చేయగా రూ. 5 కోట్ల విలువ కలిగిన 250 నకిలీ కరెన్సీ నోట్ల (RS 2000 denominations) ఉన్న బ్యాగ్‌ను గుర్తించినట్లుగా తెలిపారు.

నాలుగు కార్లలో ఉన్న వారిని విచారించగా వారి మరో ముగ్గురు సహాయకుల గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. దీని ప్రకారం, పోలీసు బృందం అంధేరి (పశ్చిమ) సబర్బన్‌లోని ఒక హోటల్‌లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుండి  100 నకిలీ కరెన్సీ నోట్లను (మళ్లీ రూ. 2,000 డినామినేషన్‌లో) స్వాధీనం చేసుకున్నారు.

అన్ని నోట్లు కూడా 2 వేల రూపాయలవే ముంద్రించి.. సర్క్యులేట్ చేసిందుకు ప్లాన్ చేశారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రైడ్ చేసి పట్టుకున్నారు. అంతా రూ.2 వేల నోట్లు ఉన్న ఏడు కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాదీనం చేసుకున్నామని ముంబై క్రైం బ్రాంచ్ డీసీపీ సంగ్రామ్ నిషందర్ తెలిపారు.

ఈ సందర్భంగా నకిలీ నోట్ల ముఠాకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారిని కోర్టులో హాజరు పరిచి, ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు కస్టడీకి కోరామని చెప్పారు. ఈ నెల 31 వరకు పోలీసు కస్టడీకి కోర్టు ఓకే చెప్పిందన్నారు. వారిని ఎంక్వైరీ చేసి.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సంగ్రామ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..