No Spitting: రోడ్డుపై ఉమ్మి వేసినందుకు రూ.39 లక్షల జరిమానా.. మీరూ ఆ తప్పు చేయకండి..

అసలే కొవిడ్ భయాలు.. ఇంటి గడప దాటేందుకే కొందరు భయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం తగ్గేదే లే అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు.

No Spitting: రోడ్డుపై ఉమ్మి వేసినందుకు రూ.39 లక్షల జరిమానా.. మీరూ ఆ తప్పు చేయకండి..
No Spitting
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 07, 2021 | 12:02 PM

అసలే కొవిడ్-19 భయాలు.. ఇంటి గడప దాటేందుకే కొందరు భయపడుతున్నారు. మరోవైపు ఇంకొందరు మాత్రం తగ్గేదే లే.. అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లు, ఇతర జనసంచార బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తూ కొవిడ్ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారి పట్ల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అలా రోడ్డు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారి నుంచి బీఎంసీ అధికారులు భారీ జరిమానా వసూలు చేశారు. దాదాపు 19,000 మంది వ్యక్తుల నుంచి రూ.39 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ సంగీత ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

ముంబై నగరవాసుల ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు. నగర ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దీనికి విఘాతం కలింగే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్లపై ఉమ్మి వేయడం కొవిడ్-19తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై ఉమ్మి వేయడాన్ని అడ్డుకునేందుకు రూ.200లు జరిమానా విధిస్తున్నట్లు వివరించారు. ఈ విషయంలో ప్రజలు అవగాహనతో మెలగాలని సూచించారు.

అలాగే కొవిడ్ వ్యాపించకుండా ఫేస్ మాస్కులు తప్పనిసరిగా వాడాలని బీఎంసీ అధికారులు నగర ప్రజలు సూచిస్తున్నారు. అలాగే చేతులకు తరచూ శ్యానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. ఈ విషయంలోనూ బీఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనందుకు పాండమిక్ ప్రారంభమైన 2020 మార్చి నుంచి రూ.57 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ జూన్ మాసంలో ఓ అధికారిక ప్రకటలో తెలిపింది.

ఇదిలా ఉండగా ముంబై నగరంలో కరోనా కేసులు కట్టడిలోకి వచ్చాయి. శుక్రవారంనాడు ముంబైలో 309 కొత్త కొవిడ్ కేసులు నమోదుకాగా..8 మంది దుర్మరణం చెందారు.

Also Read..

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలలో ట్విస్ట్..  అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..

సింహమా..సింహాలకే సింహమా?.. TRS ఎమ్మెల్యే నోముల భరత్‌పై ఆర్జీవీ ఆసక్తికర ప్రశ్న