AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. మరి ఇంత దారుణమా.. ఆ పనికి అడ్డుగా ఉన్నాడని కొడుకునే కడతేర్చింది..

వివాహేతర సంబంధం ముందు పేగుబంధాన్ని కనుమరుగు చేసింది ఓ తల్లి. కిరాతకంగా కన్నకొడుకును హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం అల్లీపూర్‎లో నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకును అత్యంత కిరాతకంగా హతమార్చింది.

ఛీ.. ఛీ.. మరి ఇంత దారుణమా.. ఆ పనికి అడ్డుగా ఉన్నాడని కొడుకునే కడతేర్చింది..
Mother Kiils Her Son
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Mar 23, 2024 | 12:06 PM

Share

వివాహేతర సంబంధం ముందు పేగుబంధాన్ని కనుమరుగు చేసింది ఓ తల్లి. కిరాతకంగా కన్నకొడుకును హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం అల్లీపూర్‎లో నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కొడుకును అత్యంత కిరాతకంగా హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నపేగును తెంచుకుంది ఆ మాతృమూర్తి. అల్లీపూర్ గ్రామానికి చెందిన డేగ రవీందర్, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్నకుమారుడు ఇంటివద్దే ఉండి పాఠశాలకు వెళ్తుండగా.. మిగిలిన ఇద్దరు కుమారులు గురుకుల పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నారు. కుటుంబ పెద్దయిన తండ్రి మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య లక్ష్మి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా ఇంటివద్దే ఉండి చదువుకుంటున్న కుమారుడు హరికృష్ణ ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నాడని విద్యేషం పెంచుకుంది తల్లి లక్ష్మీ. గుట్టుగా సాగుతున్న వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బహిర్గతం చేస్తాడోనని ఏకంగా హతమార్చేందుకు ప్లాన్ వేసింది. ఈ నెల 20వ తేదిన రాత్రి కుమారుడు హరికృష్ణ తలపై కర్రతో బాది హత్యయత్నం చేసింది. అంతటితో ఆగకుండా కన్నతల్లే క్రూరమృగంగా మారీ బాలుడి శరీరంలోని సున్నిత ప్రదేశాల్లో గాయపరిచి చంపేసింది.

ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరణ:

అయితే కుమారుడి హత్యను ప్రమాదవశాత్తు మరిణించినట్లుగా చిత్రీకరించే ప్రణాళిక రచించింది తల్లి లక్ష్మీ. బెడ్ షీట్‎లో కుమారుడి మృతదేహాన్ని చుట్టి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసింది. కుమారుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మరణించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. బాలుడు హరికృష్ణ తలకు అయిన గాయంపై చుట్టుపక్కన వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రియుడు కోసం గాలింపు చేపట్టారు. కన్నతల్లే కర్కశంగా కొడుకును హతమార్చడంతో అల్లీపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధ్యురాలైన తల్లీ లక్ష్మీని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.