Delhi Liqour Scam: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంకు షాక్.. 6 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రోస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా, ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు, ఈ మొత్తం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఇతర నేతలతో కలిసి కుట్ర పన్నారని, ఢిల్లీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో కేజ్రీవాల్ నేరుగా పాల్గొన్నారని కోర్టుకు వివరించారు. పీఎంఎల్‌ఏ కింద ఈ మొత్తం కేసులో అనేక ఆరోపణలు ఉన్నాయి. విధానానికి సంబంధించిన అభిప్రాయాలను సేకరించడమే పనిగా పెట్టుకున్న నిపుణుల కమిటీ ఏ పనీ చేయలేదని కోర్టుకు నివేదించారు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు.
ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కీలక పాత్ర పోషించారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు తెలిపారు. సిసోడియా బెయిల్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీష్ సిసోడియా విజయ్ నాయర్‌ను కేజ్రీవాల్ ఇంటికి పిలిచి మద్యం పాలసీకి సంబంధించిన పత్రాలను ఇచ్చారని ఏఎస్జీ కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూప్‌లో మిడిల్ మ్యాన్‌గా వ్యవహరించింది. ఇది మాత్రమే కాదు, వినయ్ నాయర్ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో నివసించారు. అతను ఆప్ పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్.
గోవాలో హవాలా ద్వారా రూ.40 కోట్లు బదిలీ చేసినట్లు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు తెలిపారు. గోవా ఎన్నికల కోసం ప్రిన్స్ కుమార్ సాగర్ పటేల్ నుండి డబ్బు అందుకున్నాడు. ఇది అతని కాల్ రికార్డుల ద్వారా ధృవీకరించడం జరిగింది. చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు ఏర్పాటు చేశాడు. విజయ్ నాయర్ సంస్థ చారియట్ మీడియాతో కలిసి పనిచేశాడు.
చరణ్‌ప్రీత్ సింగ్‌ను ఢిల్లీ ప్రభుత్వం 55,000 రూపాయల నెల జీతంతో PR కోసం నియమించింది. ఇందుకు సంబందించి సెల్‌ఫోన్ చాట్‌లు కూడా ఉన్నాయని, ఇవి దీన్ని నిర్ధారిస్తున్నాయని ED తెలిపింది. ఇదొక్కటే కాదు, చాలా మంది మద్యం విక్రయదారులు గరిష్ట స్థాయిలో నగదు చెల్లింపు చేశారు. కేజ్రీవాల్ పని అంతా విజయ్ నాయర్ చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. నగదు వసూలు చేయడం, ప్రజలను బెదిరించడం అతని పనిగా ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది.
ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందిందని, అయితే ఆ పార్టీకి సొంత ఉనికి లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. AAP ఒక కంపెనీ అని, దాని పనితీరులో పాలుపంచుకున్న ప్రతి వ్యక్తి ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్‌లో పాలుపంచుకున్నాడని ED విశ్వసిస్తుంది. అందుకే, ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాకుండా, పార్టీ చీఫ్‌గా కూడా నేరంలో అతని పాత్ర పెద్దది. పార్టీని నడిపించే బాధ్యత కేజ్రీవాల్‌దే, ఆయన జాతీయ కన్వీనర్, జాతీయ స్థాయిలో పార్టీకి బాధ్యత వహిస్తారు. అందుకే ఈడీ ఆయనను కింగ్‌పిన్‌గా పిలుస్తోంది. ఈ మొత్తం నేరం వెనుక కేజ్రీవాల్ ఉన్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రధాన ఆరోపణ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…