Helpline: ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ తో రూ. 22 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. అదీ మూడు నెలల్లోనే..!

సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వీటిని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.1930 అని టోల్ ఫ్రీ నెంబర్ కు నిరంతరం కొన్ని వేల కొద్ది కాల్స్ వస్తూనే ఉన్నాయి.

Helpline: ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ తో రూ. 22 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. అదీ మూడు నెలల్లోనే..!
Cyber Attack
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Balaraju Goud

Updated on: Mar 22, 2024 | 9:52 PM

సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వీటిని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.1930 అని టోల్ ఫ్రీ నెంబర్ కు నిరంతరం కొన్ని వేల కొద్ది కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎంతో మంది సైబర్ బాధితులు డబ్బులు నష్టపోయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే డబ్బులు పోగొట్టుకున్న 24 గంటల్లోపు 1930 కు కాల్ చేస్తే బాధితుల డబ్బులు నేరస్తుల ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేయగలుగుతున్నారు అధికారులు.

ఈ ఏడాది మూడు నెలల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగా వచ్చిన ఫిర్యాదుల ద్వారా సుమారు 22 కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. అయితే ఇది కేవలం ముంబై నగరానికి సంబంధించిన బాధితుల డబ్బుగా అధికారులు చెబుతున్నారు. అయితే టోల్ ఫ్రీ నెంబర్ పై విస్తారంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో సైబర్ బారిన పడిన బాధితుల ఫిర్యాదులు అంతకింతకు పెరుగుతున్నాయి. గతంలో ఏడాది మొత్తంలోనూ కేవలం 26 కోట్ల రూపాయల నగదును మాత్రమే ముంబై పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. కానీ ఈ టోల్ ఫ్రీ నంబర్ ఆధారంగా వస్తున్న ఫిర్యాదుల ద్వారా వివరాలు సేకరించి మూడు నెలల వ్యవధిలోనే సైబర్ నేరగాల ఖాతాల్లోకి వెళ్లకుండా 22 కోట్ల రూపాయల నగదును కాపాడారు.

సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో 2022 మే నెలలో 1930 టోల్ ఫ్రీ నంబర్ను కేంద్రం ప్రారంభించింది. హి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా దేశంలోని ఎక్కడినుండైనా ఏ ప్రాంతం నుండైనా సైబర్ నేరానికి గురి అవుతే వెంటనే ఈ నంబర్ ద్వారా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలా వస్తున్న ఫిర్యాదుల్లో 24 గంటల్లోపు పోగొట్టుకున్న డబ్బుపై ఫిర్యాదు చేస్తే ఆ డబ్బులు సైబర్ నేరస్తుల బారిన పడకుండా అధికారులు ఫ్రీ చేసే ఆస్కారం ఉంటుంది.

సైబర్ కేసులకు ఉన్న డిమాండ్ కారణంగా అన్ని రాష్ట్రాల కమిషనరేట్లలో సైబర్ క్రైమ్ కేసులు డీల్ చేసే పోలీసుల సంఖ్య అంతకింతకు పెరుగుతుంది. ఒకప్పుడు కేవలం 20-30 మందితో ఉన్న సైబర్ టీం ఇప్పుడు ఏకంగా వందలకు చేరుకుంది. దీంతోపాటు ప్రత్యేకించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఉపయోగంలోకి తెచ్చిన తర్వాత దీనికోసం స్పెషల్ టీంను అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేశారు. ఇ టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చే ఫిర్యాదులు అన్నిటిని పరిశీలిస్తూ వారి వివరాలను సేకరిస్తూ బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మీ డబ్బు ఆన్‌లైన్ ద్వారా అపహరణకు గురైనా, మరే ఇతర కారణంతో మీ డబ్బు అకౌంట్ లో నుండి డెబిట్ అయినా వెంటనే 1930 ద్వారా సబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. డబ్బు పోగొట్టుకున్న 24 గంటల లోపు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే మీ డబ్బును నేరస్తుల ఖాతాల్లోకి వెళ్లకుండా పోలీసులు ఫ్రీజ్ చేస్తారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…