AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రస్ట్ ఆఫ్ ది నేషన్.. TV9 నెట్‌వర్క్, డైలీహంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎన్నికల సర్వే

అతిపెద్ద ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ అంటే సార్వత్రిక ఎన్నికలు. దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న.. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుందని సీఈసీ ప్రకటించారు.

ట్రస్ట్ ఆఫ్ ది నేషన్.. TV9 నెట్‌వర్క్,  డైలీహంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎన్నికల సర్వే
Trust Of The Nation Survey
Balaraju Goud
|

Updated on: Mar 22, 2024 | 8:24 PM

Share

అతిపెద్ద ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ అంటే సార్వత్రిక ఎన్నికలు. దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న.. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించారు. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో ఒకే రోజున… మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. 18వ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ తేదీలను ఎన్నికల సంఘం ఇటీవలె ప్రకటించింది. ఈసారి దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9, న్యూస్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్ Dailyhunt సహకారంతో ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ సర్వేను నిర్వహిస్తోంది. దేశం నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీరు సమాధానాలు చెప్పవచ్చు.

ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది?

ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ పోలింగ్, 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న 89 స్థానాలకు, మూడో దశ మే 7న 94 స్థానాలకు, నాలుగోవ దశ మే 13న 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఐదో దశ మే 20న, 49 స్థానాలకు, ఆరో దశలో 57 స్థానాలకు మే 25న, చివరి దశలో అంటే ఏడో దశలో ఓటింగ్ జరగనుంది. జూన్ 1న 57 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.

ఎన్నికల్లో ఎదురయ్యే అంశాలు ఏమిటి?

లోక్‌సభ ఎన్నికలు అయినా, అసెంబ్లీ ఎన్నికలు అయినా ప్రతిసారీ ఏదో ఒక ప్రధాన సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఉదాహరణకు, 1977 లోక్‌సభ ఎన్నికలలో ఎమర్జెన్సీ పెద్ద సమస్య. 1989లో బోఫోర్స్ ఎన్నికల అంశం. అదేవిధంగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి భారతదేశాన్ని ఒక ముఖ్యమైన అంశంగా మార్చింది. అయితే ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే నినాదాన్ని ఇచ్చాయి.

డైలీహంట్ అంటే ఏమిటి?

Dailyhunt దేశంలో వార్తలు, వినోదం, వీడియోల అతిపెద్ద అగ్రిగేటర్ యాప్. ఈ ప్లాట్‌ఫారమ్‌కు 350 మిలియన్లకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. ఇది దేశంలోని 15 ప్రధాన భాషల్లో వార్తా సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

TV9 అంటే ఏమిటి?

TV9 దేశంలోనే అతిపెద్ద న్యూస్ మీడియా నెట్‌వర్క్. తెలుగులో ప్రస్థానం మొదలైన TV9 నెట్‌వర్క్ హిందీ, ఇంగ్లీషుతో పాటు బెంగాలీ, తమిళం, పంజాబీ, గుజరాతీ భాషలలో కూడా వార్తలు, వీడియో సేవలను అందిస్తోంది. దేశంలో కోట్లాది మంది ప్రజలు టీవీ9 వార్తలను విశ్వసిస్తున్నారు.

దేశం ఏం ఆలోచిస్తోంది? ప్రపంచంతో పోటీ పడేందుకు ఇండియా ఎలా దూసుకుపోతోంది? రాజకీయంగా, ఆర్థికంగా, వినోదపరంగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? పెద్ద అడుగు వేసేందుకు ఇండియా సిద్ధంగా ఉందా? పాలకుల ఆలోచనేంటి? ప్రత్యర్థుల వ్యూహమేంటి? ఈ సమకాలీన అంశాలపై సుదీర్ఘ చర్చకు టీవీ9 చక్కటి వేదిక.

ఇటీవల TV9 నెట్‌వర్క్ నిర్వహించిన కాన్‌క్లేవ్ విజయవంతమైంది. టీవీ నైన్‌ వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే గ్లోబల్‌ సమిట్‌‌లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆయన ప్రత్యర్థి మల్లికార్జున ఖర్గే వరకు, అనురాగ్‌ ఠాకూర్‌ నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ వరకు, అమీర్‌ ఖాన్‌ నుంచి కంగనా రనౌత్‌ వరకు, అమితాబ్‌ కాంత్‌ నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ వరకు, ఆయా రంగాల్లో నిష్ణాతులు, మహామహులు, అతిరథ మహారథులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..