AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కడపలో విషాదం.. రెవెన్యూ అధికారి ధన దాహానికి కుటుంబం బలి..

రెవెన్యూ ధన దాహానికి వ్యవసాయం మీద జీవించే కుటుంబం బలైంది. తమ పేరుతో ఉన్న భూమిని...రెవిన్యూ అధికారులు ఇతరుల పేరుతో రికార్డులు మార్చడంతో ఆ కుటుంబం మనస్థాపనికి గురైంది. తమ భూమిని రికార్డుల్లో వేరే పేరుతో ఎక్కించారని.. తిరిగి తమ ఎక్కించాలని కోరడమే పాపమైంది. ముడుపులు చెల్లించి మరి కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులకు కనికరం కలుగలేదు.

Andhra Pradesh: కడపలో విషాదం.. రెవెన్యూ అధికారి ధన దాహానికి కుటుంబం బలి..
Ap Crime News
Sudhir Chappidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Mar 23, 2024 | 11:52 AM

Share

రెవెన్యూ ధన దాహానికి వ్యవసాయం మీద జీవించే కుటుంబం బలైంది. తమ పేరుతో ఉన్న భూమిని…రెవిన్యూ అధికారులు ఇతరుల పేరుతో రికార్డులు మార్చడంతో ఆ కుటుంబం మనస్థాపనికి గురైంది. తమ భూమిని రికార్డుల్లో వేరే పేరుతో ఎక్కించారని.. తిరిగి తమ ఎక్కించాలని కోరడమే పాపమైంది. ముడుపులు చెల్లించి మరి కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులకు కనికరం కలుగలేదు. విసుగు చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకుని విగత జీవులయ్యారు. ఈ విషాద ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటుచేసుకుంది. మాధవరంలోని ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం ఏపీలో సంచలనంగా మారింది. రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని మనస్థాపంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్త మాధవరంలో నివాసముంటున్న పాల సుబ్బారావు (47)కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు చదువు కోసం హైదరాబాద్ వెళ్లగా చిన్న కూతురు, భార్యతో కలిసి సుబ్బారావు కొత్త మాదవరంలో నివసిస్తున్నాడు. పాల సుబ్బారావుకు ఒంటిమిట్ట మండలం మాధవరంలో 3.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గతంలో ఈయనకు ప్రభుత్వం అందించే రైతు భరోసా కూడా సుబ్బారావు ఖాతాలో పడుతుంది. గత కొద్ది సంవత్సరాల క్రితం తన పేరుతో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు కట్టా శ్రావణి అనే పేరుతో ఆన్లైన్లో మార్చారు.

ఈ భూమిని తిరిగి తన పేరుతో మార్చుకోవడానికి పాల సుబ్బారావు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు ఈయన ముడుపులు కూడా ముట్టచెప్పాడు.. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్థాపం చెందిన పాల సుబ్బారావు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

రాత్రి భార్య పద్మ, కూతురు వినయ కూడా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు బంధువులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో లభించిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. మొత్తం మీద ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడంతో మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది? సూసైడ్‌కు కారణాలేంటి? సూసైడ్‌ లెటర్‌లో ఉన్న దాంట్లో వాస్తవం ఎంత అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..