గంటా శ్రీనివాస్ పోటీ అక్కడి నుంచేనా? సర్వే ఫలితం ఆధారంగా టీడీపీ నిర్ణయం
గంటా పోటీ వ్యవహారంలో ఉన్నన్ని ట్విస్ట్‌లు ఇతర రాజకీయనేతలకు ఉండదంటే అతశయోక్తి కాదేమో అనిపిస్తుంది. గంటా ఒక విలక్షణమైన రాజకీయ నేత. 1999 లో రాజకీయ రంగం ప్రవేశించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒకసారి పార్లమెంట్‌కు, తర్వాత నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి వరుస విజయాలు నమోదు చేసిన నేత.

గంటా పోటీ వ్యవహారంలో ఉన్నన్ని ట్విస్ట్‌లు ఇతర రాజకీయనేతలకు ఉండదంటే అతశయోక్తి కాదేమో అనిపిస్తుంది. గంటా ఒక విలక్షణమైన రాజకీయ నేత. 1999 లో రాజకీయ రంగం ప్రవేశించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒకసారి పార్లమెంట్‌కు, తర్వాత నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి వరుస విజయాలు నమోదు చేసిన నేత. టీడీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన గంటా 1999లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, 2004 చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా మళ్లీ టీడీపీకి తిరిగి వచ్చి 2014 లో భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి 2109 లో మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గానికి మారి ఎక్కడ విజయం సాధించి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నారు.
ఓటమి ఎరుగని నేత కావడంతో రాజకీయ చివరి అంకంలో కూడా అలాంటి విజయపందాను కొనసాగించాలన్న ఆలోచనలో గంటా ఉన్నారు. అందుకే ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు గంటా. చివరి ప్రత్యక్ష ఎన్నికలలో కూడా విజయం సాధించి కెరీర్‌ను విజయపథంలోనే ముగించాలన్న లక్ష్యంతోనే పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టమైన విధానంతో ఉన్నారు. భీమిలి నుంచి పోటీ చేయాలన్నది గంటా అభిమతం. పార్టీ అభిమతం వేరేలా ఉంది.
మొదట చీపురుపల్లి నుంచే బరిలోకి దించాలని..
చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయించాలన్న లక్ష్యంతో రెండు రోజుల కిందట అక్కడనుంచి సర్వే నిర్వహించింది తెలుగుదేశం. బొత్సపై గంటాను పోటీ చేయించే ఆలోచనతో పాటు విజయనగరం జిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచన చేసింది టీడీపీ. దానిద్వారా బొత్సను కట్టడి చేసే అవకాశం కూడా ఉంటుందన్నది టీడీపీ ఉద్దేశం. దీంతో మొదట భీమిలి నుంచే అని పట్టుబట్టినా చీపురుపల్లికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు గంటా. కానీ విశాఖ పార్లమెంట్లో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీట్‌కు కూడా లేకపోవడంతో మళ్లీ భీమిలి నుంచే గంటాను పోటీ చేయించే ఆలోచనలో పడిందట ప్రతిపక్ష పార్టీ. అందుకోసమే గంటా పోటీ నిర్ణయంపై సమయం తీసుకుంటోంది టీడీపీ.
భీమిలి నుంచి కూడా ఐవీఅర్ఎస్ ..
అయితే చివరకు గంటా శ్రీనివాస్ పేరుతో భీమిలి లో ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహించడం ఆసక్తిని నెలకొల్పింది. నిన్న రెండు గంటలపాటు టీడీపీ శ్రేణులతో పాటు భీమిలి నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ ఫోన్ ద్వారా సంప్రదించిన తెలుగుదేశం.. గంటాకు భీమిలి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. వాస్తవానికి నిన్నటి టీడీపీ లిస్ట్‌లోనే భీమిలికి గంటా పేరు ప్రకటించాల్సి ఉన్నా చివరినిమిషంలో మళ్లీ తొలగించారు. తదుపరి లిస్ట్‌లో భీమిలి నుంచి గంటా పేరును టీడీపీ ప్రకటించనున్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..








