AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆ నటి నన్ను వేధిస్తోంది.. సీనియర్ సిటిజన్ ఫిర్యాదు.. పూర్తి వివరాలు..

తన ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యా శెట్టి తన కుటుంబాన్ని తిరిగి వేధిస్తోందంటూ శుక్రవారం విశాఖ నాలుగవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు. సోషల్ మీడియా ద్వారా తమ కుమార్తెను కూడా వేధిస్తోందని కంప్లయింట్ చేశారు. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

Vizag: ఆ నటి నన్ను వేధిస్తోంది.. సీనియర్ సిటిజన్ ఫిర్యాదు.. పూర్తి వివరాలు..
Soumya Shetty
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 23, 2024 | 11:55 AM

Share

తన ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యా శెట్టి తన కుటుంబాన్ని తిరిగి వేధిస్తోందంటూ శుక్రవారం విశాఖ నాలుగవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు. సోషల్ మీడియా ద్వారా తమ కుమార్తెను కూడా వేధిస్తోందని కంప్లయింట్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్ధమాన నటి కిల్లంపల్లి సౌమ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన కుమార్తె మోనిక దివ్యతో స్నేహం పెంచుకుందని తెలిపిన ప్రసాద్ బాబు.. ఆ తర్వాత డీప్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టు నటించిందని వివరించారు. తరచూ ఇంటికి వచ్చేదని, తాము ఇంట్లో లేకపోయినా ఇంటికి రావడం అలవాటు చేసుకుందని వివరించారు ప్రసాద్. అలా ఒకసారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి దఫదఫాలుగా 75 తులాల బంగారం చోరీ చేసిందని వాపోయిన ప్రసాద్ బాబు.. దీనిపై ఇటీవల విశాఖ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో పోలీసులు సౌమ్య శెట్టిని అరెస్టు చేసి కొంత బంగారం తమకు అందజేశారని తెలిపారు.

బెయిల్‌పై బయటకు వచ్చి సౌమ్య వేధిస్తోంది..

స్నేహితురాలి ఇంట్లో దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన నటి సౌమ్యా శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుమార్తెను వ్యక్తిగతంగా మానసిక వేదనకు గురిచేస్తోందని విశాఖ నాలుగవ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రసాద్ బాబు. తమపై దుష్ప్రచారం చేస్తోందని, చట్టపరంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపైనా ఆమె ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదులో వివరించారు. నటి సౌమ్యా చేష్టలతో సీనియర్ సిటిజనైన తాను కూడా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఫిర్యాదులో వాపోయారు ప్రసాద్ బాబు. సౌమ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను వేడుకున్నారాయన.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..