Minor Girl: ఆడుకోనివ్వడం లేదని.. తల్లిదండ్రులను బెదిరించిన 11 ఏళ్ల బాలిక.. అందరికీ ముచ్చెమటలు..
Girl sends parents threats: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ తల్లిదండ్రులు.. కుమార్తెను బయటకు వెళ్లేందుకు అనుమంతించలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో వాట్సప్ ద్వారా బెదిరించింది. రూ. కోటి ఇవ్వకపోతే కుమార్తెను
Girl sends parents threats: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ తల్లిదండ్రులు.. కుమార్తెను బయటకు వెళ్లేందుకు అనుమంతించలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో వాట్సప్ ద్వారా బెదిరించింది. రూ. కోటి ఇవ్వకపోతే కుమార్తెను చంపుతామంటూ వాట్సప్‌లో మెస్సెజ్ చేసింది. దీంతో తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. శాలిమార్ గార్డెన్ ఏరియాకు చెందిన ఓ ఇంజనీర్ నోయిడాలో పనిచేస్తున్నాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఏడో తరగతి చదువుతున్న తమ 11 ఏళ్ల కుమార్తెకు ఫోన్ కొనిచ్చారు. ఈ క్రమంలో తరచూ ఫొన్ చూస్తు ఉండటం, బయటకు వెళ్తామనడంతో తల్లిదండ్రులు మందలించారు.
దీంతో మనస్తాపానికి గురైన బాలిక తన ఫోన్‌లో వాట్సప్ స్టేటస్ అప్డేట్ చేసింది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం కూడా బాలిక ఈ విధంగానే చేయడంతో.. పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. మళ్లీ ఆ బాలిక చంపుతామంటూ డోర్‌పై పేపర్‌తో రాసి ఫోటో పెట్టింది. తన ఫోన్ హ్యాక్‌కు గురైందని, చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మెస్సెజ్ అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో పోలీసులు, తండ్రి కలిసి కూతురిని ప్రశ్నించారు. దీంతో బాలిక సంచలన విషయాలు వెల్లడించింది.
తన తండ్రి తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక తెలిపింది. తనను సెల్ ద్వారా ఆడుకోనివరని.. బయటకు వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వరని అందుకే ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం బాలిక, తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కాగా దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Also Read: