Youths Missing: ఆ సన్నిహితుల జీవితాలలో చెరగని చేదు జ్ఞాపకాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. అసలేం జరిగిందంటే..

స్నేహితులతో సంతోషాన్ని పంచుకుందామునుకున్న ఆ ఇద్దరు యువకులు చావులో ఒక్కటయ్యారు. ప్రెండ్‌షిప్ డే వేడుకలు మిత్రులతో సరదా గడపాలనుకున్న ఆ ఇద్దరు వాగులో పడి గల్లంతయ్యారు.

Youths Missing: ఆ సన్నిహితుల జీవితాలలో చెరగని చేదు జ్ఞాపకాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. అసలేం జరిగిందంటే..
Young Men Missing In Kongala Waterfall

Young Men Missing in Kongala Waterfall: కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవారు స్నేహితుడు.. ఆపదలో తోడుండేవాడు మిత్రుతు. జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. ఇదే క్రమంలో స్నేహితులతో సంతోషాన్ని పంచుకుందామునుకున్న ఆ ఇద్దరు యువకులు చావులో ఒక్కటయ్యారు. ప్రెండ్‌షిప్ డే వేడుకలు మిత్రులతో సరదా గడపాలనుకున్న ఆ ఇద్దరు వాగులో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం ఉదయం వాజేడు మండలం కొంగాల జలపాతం సందర్శనకు స్నేహితులతో కలిసి వచ్చిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అరగంట వ్యవధిలోనే గల్లంతైన ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. అప్పటి వరకు సరదా సెల్పీలు దిగుతూ, స్నానాలు చేస్తూ గడిపిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి మునిగెల నరేష్ (24)గా వాగు నీటి గల్లంతయ్యారు.. అతన్ని రక్షించే క్రమంలో మరో యువకుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రవితేజచారి జారి పడిపోయారు. దీంతో ఇద్దరు యువకులు జలపాతంలో మునిగిపోయారు.

దీంతో అక్కడే ఉన్న మిగిలినవారు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు.. గజఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read Also…  Hyderabad Artifacts:18 ఏళ్ల క్రితం చోరీకి గురైన హైదరాబాద్ వజ్రాల ఆలం అస్ట్రేలియాలో ప్రత్యక్షం.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు..!

Click on your DTH Provider to Add TV9 Telugu