AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:18 ఏళ్ల క్రితం చోరీకి గురైన హైదరాబాద్ వజ్రాల ఆలం అస్ట్రేలియాలో ప్రత్యక్షం.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు..!

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (NGA) 14 కళాఖండాల సేకరణను భారతదేశానికి తిరిగి ఇవ్వబోతోంది. వాటిలో రెండు బంగారం, వజ్రాలుతో కూడిన ఆలం, మహారాజా కిషన్ పెర్షాద్ అసలు ఛాయాచిత్రం ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad:18 ఏళ్ల క్రితం చోరీకి గురైన హైదరాబాద్ వజ్రాల ఆలం అస్ట్రేలియాలో ప్రత్యక్షం.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు..!
Hyderabad Alam In Australia
Balaraju Goud
|

Updated on: Aug 02, 2021 | 10:01 AM

Share

Hyderabad Stolen Alam in Australia: నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (NGA) 14 కళాఖండాల సేకరణను భారతదేశానికి తిరిగి ఇవ్వబోతోంది. వాటిలో రెండు బంగారం, వజ్రాలుతో కూడిన ఆలం, మహారాజా కిషన్ పెర్షాద్ అసలు ఛాయాచిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వజ్రాల ఆలం (పీర్ ) 2003లో చోరీకి గురైంది. ఆస్ట్రేలియాకు చేరింది. బంగారం,వజ్రాలతో తయారీ చేయబడిన ఆలం ఇప్పుడు నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ ఆలం ఉంది. భారత్ కు అప్పగిస్తామని ఆ ప్రభుత్వం చెబుతొంది. 1956లో చివరి నిజామ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ ఆలం ను బహుమతిగా నిజామ్ ట్రస్ట్ కు ఇచ్చాడు. ఈ ఆలం ఏంటి ? ఏలా ఉంటుంది ? ఎంత విలువ ఉంటుంది ? 2003 లో ఎలా చోరీకి గురైంది ? ఇది తిరిగి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఎవరు చేసారు? ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి ఇవ్వడానికి అంగికరించిందా? ఎప్పుడు వస్తోంది? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికంగా చర్చ కొనసాగుతోంది.

పాతబస్తీ నుంచి 18 సంవత్సరాల క్రితం చోరీకి గురైన పురాతన పవిత్రమైన అలం(పీర్లు) తిరిగి వచ్చేస్తోంది. ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ఆలం ను ఆదేశ ప్రభుత్వం భారతదేశానికి తిరిగి అప్పగించేస్తోంది. ఇదొక్కటే కాదు. మరో 14 కళాఖండాలను కూడా తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. 2003, ఏప్రిల్ 11వ తేదీన రాత్రి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజా ఖానా జెహ్రా దారుషిఫా నుంచి ఈ ఆలంను దొంగిలించారు. అలా దోపిడీకి గురైన ఆలంను దొరకపట్టడంతో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారు. అయితే, ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ.. సరియైన ఆధారాలు లభించకపోవడంతో.. కేసు మూసివేశారు.

ఇదిలావుంటే, పంచలోహం, బంగారు పూతతో తయారు చేసిన ఈ ఆలంలో విలువైన రత్నాలను అమర్చారు. అందుకే ఈ ఆలం ను దుండగులు అపహరించారు. ఇలా అపహరణకు గురైన పవిత్ర ఆలం.. స్మగ్లర్ ద్వారా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది. దీనిపై ఆరా తీయంగా అసలు విషయం తెలిసింది. ఆలంను దొంగిలించిన దుండగులు.. ఆస్ట్రేలియాకు తరలించారు. అక్కడ పోలీసులకు పట్టుబడటంతో.. దానిని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రదర్శనకు పెట్టారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం.. ఆస్ట్రేలియా సర్కార్‌తో పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఆలంతో పాటు.. దేశానికి చెందిన మరో 14 కళాకృతులను అప్పగించాల్సిందిగా కోరింది. దానికి సానుకూలంగా స్పందించింది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా. భారత్‌కు వీటిని అప్పగిస్తామని ప్రకటించింది.

చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1956 లో మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా జ్ఞాపకార్థం ఆజా ఖానా జెహ్రాలో ఈ ఆలం ను ఏర్పాటు చేశారు. అయితే, నిజాం తల్లి అమ్తూల్ జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అజా ఖానా జెహ్రా.. చార్మిత్రాత్మక చిహ్నంగా నిలిచింది. దీనిని మదర్-ఇ-డెక్కన్ (మదర్ ఆఫ్ దక్కన్) అని కూడా అంటారు. కర్బాలా యుద్ధంలో ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ మరణానికి సంతాపం తెలిపేందుకు ఈ స్మారక స్థలాన్ని షియా సంఘం ఉపయోగిస్తుంది. ఇప్పుటికీ ఆజా ఖానా నిజాం ట్రస్ట్ నిర్వహణలో కొనసాగుతోంది.

ఇదిలావుంటే.. ఇండియాకు పవిత్ర అలం తిరిగి వస్తుండడంతో హైద్రాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సఫీవుల్లా.. ఆలం ను తిరిగి ఇవ్వాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం దాని అసలు స్థానంలో తిరిగి ఇన్‌స్టాల్ చేయడానికి హైదరాబాద్‌కు అప్పగిస్తుందని ఆయన ఆశించారు. ఇండియాకు అలం చేరుకున్న తరవాత.. ఎక్కడ నుండి దొంగిలించబడిందో.. అక్కడే తిరిగి ప్రతిష్టించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.

Read Also…  Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే షాపింగ్ వోచర్లు. పిజ్జా గిప్టు కార్డులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆ దేశ సర్కార్!