అమెరికాలోని సినీ థియేటర్లో 19 ఏళ్ళ టిక్ టాక్ స్టార్ కాల్చివేత.. మరొకరు కూడా..! ఆ మూవీయే కారణమా..?
కాలిఫోర్నియాలోని ఓ సినీ థియేటర్ లో 19 ఏళ్ళ టిక్ టాక్ స్టార్ ఆంథోనీ భారజస్ ను, అతని స్నేహితుడిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఆంథోనీ స్నేహితుడిని రైలీ గుడ్ రిచ్ గా పోలీసులు గుర్తించారు.
కాలిఫోర్నియాలోని ఓ సినీ థియేటర్ లో 19 ఏళ్ళ టిక్ టాక్ స్టార్ ఆంథోనీ భారజస్ ను, అతని స్నేహితుడిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఆంథోనీ స్నేహితుడిని రైలీ గుడ్ రిచ్ గా పోలీసులు గుర్తించారు. ‘ద ఫర్ ఎవర్ పర్జ్’ అనే మూవీని సినిమా హలో ప్రదర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏడాదిలో ఒక రాత్రి ఎవరైనా హత్యతో సహా ఏ నేరమైనా చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తోందన్నది ఈ చిత్ర ఇతివృత్తమట .. మూవీ ప్రదర్శన ముగియగానే స్టాఫ్ చూస్తే ఆంథోనీ తీవ్రంగా గాయపడి ఉండడం, రైలీ నిర్జీవంగా పడి ఉండడం వారికి కనిపించింది. ఆంథోనీని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇది అప్పటికప్పుడు జరిగిన దారుణ నేరంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేయగా 20 ఏళ్ళ జోసెఫ్ జినెజ్ అనే యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు తెలిసింది. ఘటన జరిగిన అనంతరం సాక్షులు చెప్పిన దాని బట్టి పోలీసులు ఇతడి ఇంటికి వెళ్లి ఇతడిని అరెస్టు చేశారు.
తన కాల్పుల్లో మరణించినవారెవరో తనకు తెలియదని ఆ యువకుడు చెప్పాడట.. బహుశా ఈ చిత్రం చూసి దాని ప్రభావంతోనే ఇతగాడు ఈ నేరానికి పాల్పడినట్టు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. మర్డర్ తో సహా ఇతర నేరాలను ప్రోత్సహించే ఈ విధమైన చిత్రాలను ప్రదర్శించరాదని, నిజానికి ఇలాంటి చిత్రాలపై బ్యాన్ ఉందని తెలిసినా వీటిని థియేటర్ల యజమానులు ప్రదర్శిస్తున్నారు. కాగా-2012 లో ‘ది డార్క్ నైట్ రైజెస్’ అనే సినిమా చూసి ఓ వ్యక్తి తన గన్ తో 12 మందిని కాల్చి చంపాడు. కొలరాడోలోని ఓ థియేటర్లో నాడు జరిగింది ఈ ఘటన..
మరిన్ని ఇక్కడ చూడండి: Danish Siddiqui: భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారు.. ఆఫ్ఘన్ భద్రతాదళాల ధ్రువీకరణ
Sukumar: డైరెక్టర్ సుకుమార్ పెద్ద మనసు.. తండ్రి జ్ఞాపకార్థంగా సొంత గ్రామంలో…