పంద్రాగస్టున ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర… ఆక్రమిత కాశ్మీర్‌లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు ఉగ్రదాడులకు పాల్పడాలని పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ సంస్థ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.
భారత స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు ఉగ్రదాడులకు పాల్పడాలని పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అప్పుడే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ సంస్థ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. రహస్యంగా వాస్తవాదీనరేఖ ద్వారా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు 8 కొత్త రూట్లను గుర్తించినట్టు తెలిసింది. ఇందుకు వివిధ టెర్రరిస్టు బృందాల మధ్య జోరుగా సమావేశాలు జరుగుతున్నాయని, నిషిద్ధ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఆల్-బదర్ తో బాటు ముజఫరాబాద్ లోని కొత్త బెలా బందీ అనే ఉగ్రవాద సంస్థ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు గూఢాఛార వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఐ గుర్తించిన ఎనిమిది రూట్లను ఈ వర్గాలు స్ఫష్టం చేశాయి.. సరిహద్దుల్లోకొత్తగా 27 టెర్రరిస్టు పాడ్లను ఈ సంస్థ యాక్టివేట్ చేసింది. ఈ నెల 15 కి ముందే ఈ రూట్ల ద్వారా కాశ్మీర్ లోకి చొరబడాలన్నది వీరి ప్లాన్ .
గత జూన్ నుంచే సుమారు 146 మంది ఉగ్రవాదులు వివిధ లాంచ్ పాడ్ల వద్ద మోహరించినట్టు సమాచారం. ఇదే సమయంలో జమ్మూ ప్రాంతంలో ఎగురుతున్న నాలుగు డ్రోన్ల వంటి వస్తువులను గుర్తించారు. ఈ నెల 1 వ తేదీ రాత్రి మూడు వస్తువుల తాలూకు వీడియోలను స్థానికులు తమ మొబైల్స్ లో చిత్రీకరించారు. ఈ సమాచారాన్ని భద్రతా దళాలకు తెలిపారు. అయితే సెక్యూరిటీ దళాలు సెర్చ్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ కారణాల దృష్ట్యా మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: అస్సాం.. మిజోరాం మళ్ళీ ‘భాయీ-భాయీ’.. ఒకరిపై ఒకరు కేసుల ఉపసంహరణ.. కొలిక్కి వస్తున్న సరిహద్దు వివాదం