Friend Murder: దారుణం.. గంజాయి కొనేందుకు రూ.50 ఇవ్వలేదని.. స్నేహితుడిని కత్తితో కిరాతకంగా..

Ganja buying: ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న దారుణ సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతమంది సాటివారిపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు, కలిసి మెలసి తిరిగారు. అయితే.. గంజాయి

Friend Murder: దారుణం.. గంజాయి కొనేందుకు రూ.50 ఇవ్వలేదని.. స్నేహితుడిని కత్తితో కిరాతకంగా..
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Aug 02, 2021 | 8:57 AM

Ganja buying: ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న దారుణ సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొంతమంది సాటివారిపై క్రూరంగా వ్యవహరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ స్నేహితులు, కలిసి మెలసి తిరిగారు. అయితే.. గంజాయి కొనడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పల్పాడ్డాడు. మనస్తాపానికి గురైన కిరాతకుడు.. కోపంతో స్నేహితుడ్ని హత్య దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ సంఘటన బీహార్‌లోని పాట్నా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నా జిల్లా పాలి గ్రామానికి చెందిన ప్రదీప్‌ కుమార్‌, ప్రిన్స్‌ కుమార్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ప్రిన్స్‌ కుమార్‌ గంజాయికి బానిస.. రోజూ గంజాయి తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం తనకు గంజాయి కొనడానికి 50 రూపాయలు ఇవ్వాలని ప్రదీప్‌ను అడిగాడు. ఆ క్రమంలో ప్రదీప్‌ డబ్బులు ఇవ్వనని తెగెసి చెప్పడంతో.. ఇద్దరికీ మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో అసహనానికి గురైన ప్రిన్స్‌.. తన దగ్గర ఉన్న కత్తితో ప్రదీప్‌ రొమ్ముపై నాలుగైదు సార్లు పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. తీవ్రగాయాలపాలైన ప్రదీప్‌ను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే.. ప్రదీప్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

రెండేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుక్కపిల్లను టీవీలో చూసి…ఆనందం పట్టలేకపోయిన కుటుంబం

Deer Fight: రెండు కాళ్ళు ఎత్తి .. కొమ్ములతో కుమ్ముకున్న రెండు ఆడ జింకలు.. ఆడోళ్ళు కదా అంటూ ఫన్నీ కామెంట్స్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే