Deer Fight: రెండు కాళ్ళు ఎత్తి .. కొమ్ములతో కుమ్ముకున్న రెండు ఆడ జింకలు.. ఆడోళ్ళు కదా అంటూ ఫన్నీ కామెంట్స్
Deer Fight: ఇప్పటివరకూ మనిషి మనిషి కొట్టుకోవడం చూశాం.. ఇక ఆధిపత్యం కోసం సింహాలు, పాముతో పాము పోరాటం ఇలాంటి వీడియో తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్..
Deer Fight: ఇప్పటివరకూ మనిషి మనిషి కొట్టుకోవడం చూశాం.. ఇక ఆధిపత్యం కోసం సింహాలు, పాముతో పాము పోరాటం ఇలాంటి వీడియో తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సార్లు చూసే పోరాట దృశ్యాలు చూస్తే ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. అందులనూ సాధువు జంతువులు పోరాడుతుంటే ఆ పోరాటానికి వచ్చే అందం ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా రెండు జింకలు కొమ్ములు పైకెత్తి… రెండు కాళ్ళమీద నిల్చుని ఒకదానితో ఒకటి చేస్తున్న ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వీర లెవెల్లో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.
రెండు నొప్పులు కలిస్తే ముప్పే అనే సామెత జింకలకు కూడా వర్తిస్తుందా అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆహ్లాదం కలిగిస్తున్న జింకల ఫైట్ అమెరికాలోని టెక్సాస్ లోని సోమర్ విల్లే లేక్‌లో జరిగింది.
ఓ ఆడజింక తన మానాన తాను ఒంటరిగా గడ్డి మేస్తూ ఉంది. అదే సమయంలో అక్కడకు మరో ఆడజింక వచ్చింది. వాటి మధ్యన ఎం జరిగిందో కానీ హఠాత్తుగా గొడవ మొదలైంది. రెండు కాళ్లను గాల్లోకి లేపి మరీ ఒకదాన్ని ఒకటి పొడుచుకున్నాయి. ముందు ఒక జింక తన ముందు కాళ్లను గాల్లోకి లేపగానే తర్వాత ఇంకో జింక తానేం తక్కువ అన్నట్లు తాను కూడా యుద్ధానికి సిద్ధమయింది. కొన్ని సెకన్ల పాటు ఇలా జింకలు కొట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి పరుగెత్తాయి. ఇదే విషయంపై జింకల యజమాని గే ఇస్బర్ స్పందిస్తూ.. ఇలా ఆడజింకలు కొటుకోవడం తన జన్మలో చూడలేదని ఇదే ఫస్ట్ టైం అన్నారు. ఈ జింకలు కొటుకుంటున్నపుడు తనకు అవి సేమ్ గ్రహాంతర వాసులుగా కనిపించాయని చెప్పారు. అయితే ఈ జింకల ఫైట్ జరిగి దాదాపు మూడేళ్లు అయినా మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని