AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రాలు చేస్తున్నాడని పెట్రోల్ పోసి నిప్పుల్లో తోసేశారు.. మేనమామపై దారుణకాండ.. చివరికి

మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సుదర్శన్.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో....

Telangana: మంత్రాలు చేస్తున్నాడని పెట్రోల్ పోసి నిప్పుల్లో తోసేశారు.. మేనమామపై దారుణకాండ.. చివరికి
Black Magic
Ganesh Mudavath
|

Updated on: Jun 06, 2022 | 6:35 AM

Share

మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సుదర్శన్.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో శనివారం గంగుల సుదర్శన్‌ పై అతని చెల్లెలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి సజీవ దహనానికి ప్రయత్నించారు. అదే సమయంలో గ్రామానికి వచ్చిన పోలీసులు సుదర్శన్‌ను రక్షించి రామాయంపేట(Ramayampet) ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌(Hyderabad) గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. చల్మెడ గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్‌.. బీడీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు ఉన్నారు. సుదర్శన్ తో పాటు అతని చెల్లి భూదేవి కూడా కుటుంబంతో కలిసి అదే గ్రామంలో నివాసముంటోంది. ఆమె కోడలు రుచిత అనారోగ్యంతో బాధపడుతోంది. రుచిత అనారోగ్యానికి తన అన్న సుదర్శన్ కారణం అని అనుమానం పెంచుకుంది. సుదర్శన్‌ మంత్రాలు చేయడంతోనే తన కోడలికి ఈ పరిస్థితి వచ్చిందని భావించింది. ఈ క్రమంలో వారంతా సుదర్శన్ ఇంటికి వెళ్లి మాట్లాడి వెళ్లిపోయారు. కాసేపయ్యాక మళ్లీ తిరిగి వచ్చి సుదర్శన్‌, ఆయన భార్య బాలమణి, కుమారుడు హరికృష్ణలపై దాడి చేశారు.

మరికొంతమంది గ్రామస్థులు కూడా సుదర్శన్ పై దాడి చేశారు. బైక్ కు నిప్పంటించారు. సుదర్శన్‌పై పెట్రోల్ పోసి మంటల్లోకి తోసేశారు. ఈ ఘటనలో సుదర్శన్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా సుదర్శన్ ను సజీవ దహనం చేసేందుకు సిద్ధం అయ్యారు. సరిగ్గా అదే సమయంలో గ్రామానికి వచ్చిన పోలీసులు జనం గుమిగూడి ఉండటాన్ని గమనించి, సుదర్శన్‌ను కాపాడారు. చికిత్స నిమిత్తం బాధితుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి