Crime News: ఉద్యోగం నుంచి తొలగించమన్నందుకు దారుణం.. మాజీ యజమాని భార్యను గొంతు నులిమి, కరెంట్ షాక్ ఇచ్చి చంపిన డ్రైవర్..
దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. డ్రైవర్ ఉద్యోగం నుంచి తనను తొలగించమని చెప్పినందుకు యజమాని భార్యపై కక్ష పెంచుకున్న
దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. డ్రైవర్ ఉద్యోగం నుంచి తనను తొలగించమని చెప్పినందుకు యజమాని భార్యపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. మొదట గొంతు నులిమి హతమార్చి ఆపై ఆమె చనిపోయిందో లేదో నిర్ధారించుకునేందుకు కరెంట్ షాక్ ఇచ్చాడు. దిల్లీలోని బురారీ ప్రాంతలోని వెస్ట్‌సంత్ నగర్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి మృతురాలి సమాచారం తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం సాయంత్రానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
జీతం డబ్బులు కూడా ఇవ్వలేదు.. అందుకే.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… దిల్లీ యూనివర్సిటీలో అడ్ హక్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న వీరేందర్ కుమార్‌కు నాలుగేళ్ల క్రితం నిందితుడు రాకేష్ పరిచయమయ్యాడు. అతనికి తన ఫ్లాట్‌లోనే ఒక ప్రత్యేక గది ఇచ్చి డ్రైవర్‌గా నియమించుకున్నాడు. తనకు నెలనెలా జీతం వద్దని.. అవసరమైతే మొత్తం ఒకేసారి తీసుకుంటానని యజమానితో చెప్పాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరేందర్ పింకీ అనే యువతిని పెళ్లిచేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే రాకేష్ ప్రవర్తన పింకీకి నచ్చలేదు. తన భర్తను ఒప్పించి కొన్ని నెలల క్రితం అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. ఆతర్వాత రెండు నెలల క్రితం ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. దీంతో పింకీపై కక్ష పెంచుకున్నాడు రాకేశ్. సోమవారం ఉదయం వీరేందర్ ఆమె తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లాడని తెలుసుకున్న అతడు పింకీ ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించాడు. మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్లాడు. గొంతు నులిమి పింకీని హత్య చేశాడు. ఆతర్వాత కరెంట్ షాక్ కూడా ఇచ్చాడు. పింకీ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చాడు. వీరేందర్ దంపతులు తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని రాకేష్ చెబుతున్నాడు. అంతేకాదు తాను పనిచేసిన కాలానికి మొత్తం రూ.3 లక్షల సొమ్ము రావాల్సి ఉందని అవి కూడా ఇవ్వకుండా మోసం చేసినందుకే పింకీని హతమార్చానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
Also read:
Watch Video: వీడు దేశ ముదురు.. విదేశీ కరెన్సీ తరలిస్తూ ఎలా దొరికిపోయాడో చూస్తే షాకే…
Fake Baba: ఒక్కొక్కటిగా బయటకొస్తున్న బురిడీ బాబా లీలలు.. లక్షల డబ్బులను కోట్లు చేస్తానంటూ..