Fake Baba: ఒక్కొక్కటిగా బయటకొస్తున్న బురిడీ బాబా లీలలు.. లక్షల డబ్బులను కోట్లు చేస్తానంటూ..
Fake Baba: బురిడీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. రూ. కోట్లలో జనాలకు కుచ్చుటోపీ పెట్టిన బురిడీ బాబా లీలలు టీవి9 కు ఎక్స్‌క్లూజివ్ గా చిక్కాయి.
Fake Baba: బురిడీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. రూ. కోట్లలో జనాలకు కుచ్చుటోపీ పెట్టిన బురిడీ బాబా లీలలు టీవి9 కు ఎక్స్‌క్లూజివ్ గా చిక్కాయి. లక్షల డబ్బులను కోట్లు చేస్తానంటూ నమ్మించి.. వాటిని నిజంగానే మాయచేసి రెట్టింపు చేసినట్టుగా నమ్మించి మస్కా కొడుతున్న దృశ్యాలు టీవి9 కి చిక్కాయి. ఏకంగా బియ్యం నుంచి బంగారు కడాలు తీస్తూ ఔరా అనిపించాడు ఈ బురిడి బాబా. ప్రస్తుత ఊచలు లెక్కెడుతున్న ఈ బాబా ఉట్నూర్, శ్యాంపూర్ ఏజేన్సీలో వందల మందిని నిండా ముంచినట్టు సమాచారం.
మాయమాటలతో జనాన్ని మోసం చేస్తున్న బురిడీ బాబాను ఆదిలాబాద్ పోలీసులు అక్టోబర్ నెలలో అరెస్ట్ చేశారు. ఉట్నూరు మండలం శ్యాంపూర్ కు చెందిన సూర్యవంశీ అనే వ్యక్తి బాబా అవతారం ఎత్తి ఘరానా మోసానికి తెరలేపాడు. తాను పూజల ద్వారా డబ్బును రెండింతలు చేస్తానని ప్రజలను నమ్మించాడు. వందను రెండు వందలు.. రెండు వేలను పది వేలు.. లక్షను కోటీ చేస్తానంటూ నమ్మబలికి బురిడీ లీలతో నిండా ముంచేశాడు. మాయబాబా మాటలు నమ్మి ఆదిలాబాద్ కు చెందిన పారూక్ లక్ష రూపాయలు ఇచ్చి పూజలు చేయించాడు. పూజల తర్వాత బాబా రూ. లక్షన్నర ఇచ్చి ఫరూక్ కు నమ్మకం కలిగించాడు. ఈవిషయాన్ని ఫరూక్ తన బంధువులలో కొందరికి చెప్పాడు.
అక్టోబర్ నెల 15న ఫరూక్ బంధువులు బాబాకు రూ. 10 లక్షలు ఇచ్చి వాటిని రెట్టింపు చేసేందుకు పూజలు చేయమని కోరారు. ఆ డబ్బు తీసుకుని దొంగబాబా పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగబాబాతో పాటు అతనికి సహకరించిన సంగీత అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 11 లక్షల 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి రిమాండ్ లో ఉండగా బురిడీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
Also read:
Health Tips: మీరు తీసుకునే ఆహారంలో ఇవి ఉన్నాయా.. లేకుంటే ఓ సారి చెక్ చేసుకోండి..