Covid 19 Vaccine: టీకా వేసేందుకు పోతే చుక్కలు చూపించారు.. ఈ బామ్మ అయితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాల్సిందే..
Covid 19 Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే నివారణ చర్యలతో పాటు టీకా ఒక్కటే ప్రధాన మార్గం అని ప్రభుత్వాలు, వైద్యాధికారులు, నిపుణులు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా...
Covid 19 Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే నివారణ చర్యలతో పాటు టీకా ఒక్కటే ప్రధాన మార్గం అని ప్రభుత్వాలు, వైద్యాధికారులు, నిపుణులు నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా కొందరు జనాలకు ఏమాత్రం ఎక్కడం లేదు. టీకాపై అవగాహన కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరి విషయంలో అవి గంగల కలిపిన పన్నీరే అవుతోంది. టీకా వేసుకుంటే ఏదో జరిగిపోతుందేమోననే భయంతో జనాలు టీకా వేసుకునేందుకే జంకుతున్నారు. ఈ క్రమంలో టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోవిడ్ టీకాల వితరణలో వింత వింత ఘటనలు ఎదుర్కొన్నారు వైద్య సిబ్బంది. జీవితంలో ఇంజెక్షన్ ఎరుగని వారు.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. అంతేకాదు.. ఇంజెక్షన్ వేస్తామని వచ్చిన వైద్య సిబ్బంది సినిమా చూపిస్తున్నారు.
తాజాగా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలికి వ్యాక్సిన్ వేసేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించింది. అయితే, తనకు టీకా వద్దని ఆ వృద్ధురాలు కారఖండిగా తేల్చి చెప్పింది. టీకా వేస్తే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ వైద్య సిబ్బందిని బెదిరించింది. ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దాంతో సిబ్బంది వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన ఇలా ఉంటే.. ములుగు జిల్లా వెంకటాపురంలో రాజేష్ అనే డ్రైవర్ విషయంలోనూ సేమ్ సీన్ ఎదురైంది వైద్య సిబ్బందికి. తన జీవితంలో నాటు వైద్యమే తప్ప.. ఇంజెక్షన్, మెడిసిన్స్ అనేవే ఎరుగనని, తాను కోవిడ్ టీకా వేసుకోనంటే వేసుకోను అని పట్టుబట్టాడు. కోవిడ్ టీకా పట్ల తీవ్ర భయం వ్యక్తం చేశాడు. దాంతో అతనికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే.. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక చేసేదేం లేక వైద్య సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also read: