AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టపడకుండానే కోటి రూపాయలు కొట్టెయ్యడానికి కంత్రీ ప్లాన్.. బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్‌తో బీమా క్లెయిమ్

Madhya Pradesh: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు.. ఈ విషయాన్నీ ఒక వ్యక్తి బాగా వంట బట్టించుకున్నాడు. కష్టపడకుండా కోట్లు కొట్టేయాలని..

కష్టపడకుండానే కోటి రూపాయలు కొట్టెయ్యడానికి కంత్రీ ప్లాన్.. బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్‌తో బీమా క్లెయిమ్
Madhya Pradesh
Surya Kala
|

Updated on: Nov 09, 2021 | 5:25 PM

Share

Madhya Pradesh: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు.. ఈ విషయాన్నీ ఒక వ్యక్తి బాగా వంటబట్టించుకున్నాడు. కష్టపడకుండా కోట్లు కొట్టేయాలని పెద్ద పథకం రచించాడు. తాను బతికి ఉండగానే చచ్చిపోయినట్లు ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాడు. అనంతరం తనపేరున ఉన్న కోటి రూపాయల బీమాను కొట్టేయాలని పన్నాగం పన్ని.. తీరా అది బయటపడడంతో ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో పాటు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని 46 ఏళ్ల వ్యక్తి తన మరణానికి చెందిన నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి.. కోటి రూపాయల బీమా క్లెయిమ్ చేయడానికి వాటిని ఉపయోగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు అబ్దుల్‌ హనీఫ్‌తో పాటు హనీఫ్‌ మృతికి నకిలీ పత్రం తయారు చేసిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీమా కంపెనీ ఫిర్యాదు మేరకు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న హనీఫ్ భార్య, కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారి చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు హనీఫ్ సెప్టెంబరు 2019లో ఓ బీమా కంపెనీలో ఆన్  లైన్ ద్వారా కోటి రూపాయల విలువైన బీమా పాలసీ తీసుకున్నాడు. రెండు వాయిదాలను చెల్లించాడు. అనంతరం భీమా మొత్తం కోటి కొట్టేయడానికి వైద్యుడు షకీర్ మన్సూరితో కలిసి ప్లాన్ చేశాడు.  హనీస్ కుమారుడు ఇక్బాల్ ఒక డాక్టర్ షకీర్ మన్సూరి సంతకం చేసిన పత్రాల ఆధారంగా స్థానిక పౌర సంస్థ నుండి మరణ ధృవీకరణ పత్రాన్ని పొందాడు. డెత్ సర్టిఫికేట్ పొందిన తరువాత, హనీఫ్ భార్య రెహానా కోటి రూపాయల బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసింది. అయితే, బీమా కంపెనీ అధికారులకు అనుమానం వచ్చి పత్రాలను పరిశీలించారు. వెంటనే దేవాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనీఫ్ బతికి ఉన్నట్లు పోలీసు ఎంక్వైరీ లో తెలిసింది.  పరారీలో ఉన్న హనీఫ్‌ భార్య, కుమారుడి కోసం ప్రయత్నించి ఆదివారం అరెస్ట్ చేశారు. హనీఫ్, రెహానా, ఇక్బాల్‌తోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులపై ఫోర్జరీ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. డాక్టర్ డిగ్రీ కూడా పరిశీలపై కూడా అనుమానం ఉందని పోలీసులు చెప్పారు.

Also Read:  త్వరలో తీరనున్న భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు.. డిసెంబర్‌లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ ఓపెన్‌కు సన్నాహాలు..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?