ప్లాస్టిక్ కవర్‌లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం.. పోలీసుల అదుపులో మృతురాలి కుమార్తె..!
Mumbai decomposed woman body: లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీ రోజుల తరబడి గదిలో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చిన్న చితక తగాదాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. అన్యం పుణ్యం ఎరుగని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ప్లాస్టిక్ సంచిలో 53 ఏళ్ల మహిళ మృతదేహం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రెండు నెలలుగా కనిపించకుండాపోయిన మహిళ కుళ్లినపోయిన స్థితిలో కనిపించింది. బంధువుల కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు నిజాన్ని తేల్చేశారు.
లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీ రోజుల తరబడి గదిలో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సంబంధించి 22 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న యువతి.. చనిపోయన మహిళ కూతురు కావడం విశేషం.
మృతుడి సోదరుడు, మేనల్లుడు కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇబ్రహీం కసమ్ భవనంలో పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో తనిఖీ చేయగా.. ప్లాస్టిక్ సంచిలో మహిళ కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. చనిపోయిన మహిళ మృతదేహం లభించిన ఫ్లాట్‌లోనే నివాసముంటున్న ఆమె కూతుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఎలా చనిపోయింది..? ఎప్పుడు చనిపోయిందనే విషయాల్ని రాబట్టేందుకు పోలీసులు యువతిని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపినట్లుగా డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు.
మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే కొన్ని రోజుల క్రితమే చనిపోయినట్లుగా ముంబై పోలీసులు భావిస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే సుమారు రెండు నెలలుగా బాధితురాలు కనిపించడం లేదని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి దుర్వాసన రాకపోవడం వల్లే ఎవరు గమనించలేకపోయారని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. మిస్సింగ్ కంప్లైంట్ కాస్తా డెత్ కేసుగా మారడంతో పోలీసులు కూడా అదే కోణంలో విచారిస్తున్నారు. ఆమె చనిపోయిందా లేద చంపారా..? ఎవరు చంపారు..? ఎందుకు చంపారనే విషయంపై పోలీసుల అదుపులో ఉన్న కూతుర్ని ప్రశ్నించనున్నారు.
ముంబైలో ఇదే తరహాలో మరో కేసు ఇటీవలే కలకలం రేపింది. చించ్‌పోక్లిలో నిర్మాణంలో ఉన్న 12వ అంతస్తులో వెదురు పరంజాలో 19 ఏళ్ల వ్యక్తి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి వేలాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగాల్‌కు చెందిన మసూద్ మియా రంజాన్‌గా గుర్తించారు. ఇతను కూడా చనిపోయే ఒక రోజు ముందు అదృశ్యమైనట్లుగా పోలీసులు తేల్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..