Kajal Saved at Gomti Express: కాజల్‌‌కు భూమి మీద నూకలు ఉన్నాయి.. రెప్పపాటులో మృత్యువును తప్పించుకుంది

రెప్పపాటులో ఆ యువతి చావు నుంచి బయటపడింది. రైలు ఎక్కబోతూ కిందపడిపోయింది. లేడీ కానిస్ఠేబుల్‌ కాపాడడంతో ఆ యువతి ప్రాణాలు దక్కాయి.

Kajal Saved at Gomti Express: కాజల్‌‌కు భూమి మీద నూకలు ఉన్నాయి.. రెప్పపాటులో మృత్యువును తప్పించుకుంది
Lucknow Girl kajal
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 24, 2021 | 11:09 PM

Lucknow Girl Kajal: ఆమెకు భూమి మీద నూకలు ఉన్నాయి.. మృత్యువును ఆ యువతి తృటిలో తప్పించుకుంది.లక్నో రైల్వేస్టేషన్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ యువతి రైలు ఎక్కుతున్న సమయంలో కిందపడిపోయింది. ఆ యువతిని రన్నింగ్‌ ట్రేన్‌ లాక్కెళ్లింది. అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్‌పీఎఫ్‌ లేడీ కానిస్టేబుళ్లు వెంటనే పరిగెత్తారు. ఆ యువతిని రక్షించారు .

నిండు ప్రాణాలను కాపాడారు. ఈ ప్రమాదం సీసీటీవీల్లో రికార్డయ్యింది. వినీత అనే ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చాకచక్యంగా ప్రవర్తించడంతో ఆ యువతి ప్రాణాలు దక్కాయి. రన్నింగ్‌ ట్రేన్‌ ఎక్కడం చాలా ప్రమాదకరమని , అలా ఎవరు చేయవద్దని అంటున్నారు వినీత. చేతిలో బ్యాగ్‌తో రైలు ఎక్కడానికి ప్రయత్నించడంతో ఆ యువతి కిందపడిపోయింది. నిండు ప్రాణాలను కాపాడిని వినీతను అందరూ ప్రశంసించారు.

ప్రమాదం నుంచి తప్పించుకున్న యువతిని కాజల్‌గా గుర్తించారు. లక్నో రైల్వేస్టేషన్‌లో గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హడావుడిలో తాను రైలు ఎక్కుతుంటే కింద పడిపోయానని తెలిపారు కాజల్‌.. ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అయినప్పటికి ప్రజల్లో అవగాహన రావడం లేదు.

రెప్పపాటులో కాజల్‌ మృత్యువును తప్పించుకుంది. వినీతకుమార్‌ డేర్‌ చేసి ముందుకురావడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. చివరిక్షణం వరకు ప్రయాణికులు ఉండరాదని , ముందుగానే రైలు ఎక్కాలని స్టేషన్‌ సిబ్బందితో పాటు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి కాజల్‌ రైలు ఎక్కుతున్న సమయంలో చాలా స్పీడ్‌గా వెళ్తోంది. అయినప్పటికి రైలులో ఎక్కడానికి ఆమె ప్రయత్నించింది.

ఆ నిర్లక్ష్యమే ప్రాణం మీదకు తెచ్చింది. కాని భగవంతుడి దయంతో కాజల్‌ బతికిపోయింది. ప్రజల్లో చైతన్యం రావాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది. అందుకే ఈ వీడియోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తునట్టు ప్రకటించింది.

వాస్తవానికి ఇలాంటి ప్రమాదాలు ముంబైలో ఎక్కువగా జరుగుతుంటాయి. లోకల్‌ రైళ్లలో ఎక్కే ప్రయత్నంలో చాలామంది కిందపడిపోతుంటారు.. ప్రాణాలు కోల్పోతుంటారు. కాని ఈ ప్రమాదం లక్నో లోని చారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగింది.

ఇవి కూడా చదవండి

SBI Deposit Scheme: ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఇలా చేయండి..

క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో చెప్పకనే చెప్పిన ఆర్బీఐ

COVID-19 vaccination దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక 60 ఏళ్ల పైబ‌డిన వారికి కూడా క‌రోనా వ్యాక్సిన్‌