AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో చెప్పకనే చెప్పిన ఆర్బీఐ

భారత్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపింది.

క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో చెప్పకనే చెప్పిన ఆర్బీఐ
cryptocurrency
Sanjay Kasula
|

Updated on: Feb 24, 2021 | 9:52 PM

Share

RBI Governor on Bitcoin: క్రిప్టోకరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ భారీ స్థాయిలో పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్బీఐ కామెంట్స్‌కు ప్రధాన్యత నెలకొంది. భారత్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

క్రిప్టోకరెన్సీల విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధికారికంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్న సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీపై పూర్తిగా నిషేధించి.., సొంత డిజిటల్‌ కరెన్సీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి స్పష్టంచేశారు.

దీంతో ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్‌ యువాన్‌తో పాటు డిజిటల్‌ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్‌ చేరుతుందని వెల్లడించారు. అయితే, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టం చేయలేదు. ఇందుకోసం కావాల్సిన సాంకేతికత, విధానపరమైన అంశాలపై ఆర్‌బీఐ పనిచేస్తోందని అన్నారు.

బిట్‌కాయిన్‌ విలువ ఎన్నడూ లేనంతగా ఇటీవల పెరగడంతో క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరిగింది. నోట్ల రద్దు తర్వాత దేశీయంగానూ ఈ తరహా కరెన్సీ వినియోగం మరింత ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్‌బీఐ.. 2018లో వీటిని నిషేధించింది. అయితే, ఆర్‌బీఐ ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది.

ఇది కూడా చదవండి

SBI Deposit Scheme: ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఇలా చేయండి..

COVID-19 vaccination దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక 60 ఏళ్ల పైబ‌డిన వారికి కూడా క‌రోనా వ్యాక్సిన్‌