ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం.. ప్రైవేటీకరణతోనే దేశాభివృద్ది, ప్రభుత్వ రంగ సంస్థలపై తేల్చేసిన ప్రధాని మోదీ

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లక్ష్యం వ్యాపారం కాదన్నారు మోదీ. ప్రైవేటీకరణ తోనే దేశాభివృద్ది..

ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం.. ప్రైవేటీకరణతోనే దేశాభివృద్ది, ప్రభుత్వ రంగ సంస్థలపై తేల్చేసిన ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Feb 24, 2021 | 9:19 PM

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లక్ష్యం వ్యాపారం కాదన్నారు మోదీ. ప్రైవేటీకరణ తోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని స్పష్టం చేశారు. పీఎస్‌యూలను నడపడానికి ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని మోదీ చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని మోదీ చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు అని వివరించారు. 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమన్నారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్‌ వేసిందని మోదీ అన్నారు. 18 రంగాల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్‌ , ఇన్సూరెన్స్‌ , ఎరువులు , పెట్రోలియం , డిఫెన్స్‌ ఉత్పత్తి రంగాల్లో ప్రభుత్వ పాత్ర పరిమితం కాబోతోంది.

Read also :

ఇక్కడే పుట్టిపెరిగా.. తెలంగాణ కోడల్ని, ప్రతీ గడపకీ వెళ్తా, నా స్థానికత ప్రశ్నించే హక్కు ఎవరికీలేదు: వైఎస్ షర్మిల

ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.