COVID-19 vaccination: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక 60 ఏళ్ల పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్
COVID-19 vaccination: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు..
Novel Coronavirus: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ప్రకటించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా ఇస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నట్లు అన్నారు . ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు.
From March 1, people above 60 years of age and those above 45 years of age with comorbidities will be vaccinated at 10,000 govt & over 20,000 private vaccination centres. The vaccine will be given free of cost at govt centres: Union Minister Prakash Javadekar#COVID19 pic.twitter.com/Rxhkkk8eSC
— ANI (@ANI) February 24, 2021
టీకా పంపిణీలో భారత్మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక మందికి వ్యాక్సినేషన్చేసిన మూడో దేశంగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్‌లుండగా.. భారత్ మూడోస్థానంలో ఉన్నట్టు ప్రకటించంది. భారత్‌తో వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై పూర్తిస్థాయిలో ఏ దాపరికాలు లేకుండా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈయూ తెలిపింది.