మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్, 10 కోట్ల మందికి పంపిణీ, కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇవాళ కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు...
దేశవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇవాళ కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండో దశలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. 10 వేల ప్రభుత్వ కేంద్రాల్లో, 20వేల ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషప్ పంపిణీ జరుగుతుంది. 60 ఏళ్లు పైబడ్డ వృద్దులకు ఉచితంగా టీకా ఇస్తారు. 45 ఏళ్లు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు కూడా ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుంది. ప్రభుత్వం కేంద్రాలలోనే ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. ప్రైవేట్ కేంద్రాల్లో మాత్రం డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని సూచించారు.
Read also :